Allu Arjun : పుష్ప 2 తరువాత లాంగ్ బ్రేక్ తీసుకోనున్న అల్లు అర్జున్ ?
పుష్ప-2 ప్రమోషన్స్ అదరగొడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్.

will Allu Arjun take a long break after Pushpa 2
Gossip Garage : పుష్ప-2 ప్రమోషన్స్ అదరగొడుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. పాట్నాలో పుష్ప-2 ట్రైలర్ లాంచ్, చెన్నైలో కిసిక్ సాంగ్ రిలీజ్..ఇలా వరుస ఈవెంట్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. డిసెంబర్ ఫస్ట్‌న హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇలా పుష్ప-2 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాన్ స్టాప్‌గా వర్క్ చేస్తూ వస్తున్నాడు అల్లు అర్జున్. దాదాపు 2 వేల కోట్ల టార్గెట్ పెట్టుకున్న బన్నీ దానికి తగ్గట్టు కష్టపడుతున్నాడు. ఇక సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ తర్వాత అయితే మరోసారి పెద్ద బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నాడట అల్లుఅర్జున్.
డిసెంబర్ 5న పుష్ప-2 రిలీజ్ తర్వాత కూడా 20 రోజుల పాటు ప్రమోషన్స్, ప్రెస్ మీట్లు, ఇంటర్య్యూలతో బిజీగా గడపనున్నాడు బన్నీ. ఇక న్యూఇయర్ జనవరి నుంచి దాదాపు 6 నెలలు పాటు బిగ్ బ్రేక్ తీసుకోబోతున్నాడని టాక్.
Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ కోసం పోలీసుల వేట.. అరెస్ట్ పై పోలీసు అధికారి కీలక వ్యాఖ్యలు..
ప్రస్తుతం డే అండ్ నైట్ షూటింగ్‌తో కష్టపడుతున్న అల్లుఅర్జున్ ఫ్యామిలీ కోసం బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ఆరు నెలల పాటు ఫ్యామిలీతో టూర్లకు వెళ్లి రిలాక్స్ కావాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈలోపు త్రివిక్రమ్ స్టోరీ వర్క్ కూడా కంప్లీట్ అవుతుందని అంటున్నారు.
పుష్ప-2 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న అల్లుఅర్జున్..నెక్స్ట్ ప్రాజెక్టుపై కూడా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారట. ఆ సినిమా షూటింగ్‌కు కూడా బానే టైమ్ పడుతుందని ఓ అంచనాకు వచ్చారట. అందుకే లాంగ్ బ్రేక్ తీసుకుని రిలాక్స్ అయి వస్తే..నెక్స్ట్ ప్రాజెక్టును కూడా ఫుల్ జోష్ కంప్లీట్ చేయొచ్చని అనుకుంటున్నాడట ఐకాన్ స్టార్. పుష్ప-2 రిలీజ్ తర్వాత ఆరు నెలల పాటు రెస్ట్ తీసుకుని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పెద్ద మూవీ చేయబోతున్నాడని అంటున్నారు. ఇది మైథాలజికల్ మూవీ అని కొందరు..హిస్టారికల్ మూవీ అని ఇంకొందరు చెబుతున్నారు. హిస్టారికల్ టచ్‌తో త్రివిక్రమ్ స్టోరీ రాశాడని..అది బన్నికీ బాగా నచ్చిందని మరికొందరు అంటున్నారు. మంగోలియన్ల నాయకుడు చెంఘీజ్ ఖాన్ బయోపిక్‌గా రాబోతున్నట్లు మూవీలో బన్నీ యాక్ట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
Lucky Baskhar : లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడ?