Lucky Baskhar : లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడ?

థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన లక్కీ భాస్కర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.

Lucky Baskhar : లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు? ఎక్కడ?

Dulquer Salmaan Lucky Baskhar OTT Streaming Details Here

Updated On : November 25, 2024 / 2:18 PM IST

Lucky Baskhar : ఇటీవల దీపావళికి లక్కీ భాస్కర్ సినిమా రిలీజయి భారీ విజయం సాధించింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించి థియేటర్స్ లో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ సినిమాని నిర్మించారు.

Also Read : Vere Level Office : ఆహాలో మరో సరికొత్త సిరీస్.. ‘వేరే లెవెల్ ఆఫీస్’ ట్రైలర్ రిలీజ్..

పీరియాడిక్ బ్యాంక్ స్కామ్స్ కథాంశంతో సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు లక్కీ భాస్కర్ సినిమాను. థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాను ఓటీటీలో నవంబర్ 28 నుంచి చూసేయండి..

Image