Vere Level Office : ఆహాలో మరో సరికొత్త సిరీస్.. ‘వేరే లెవెల్ ఆఫీస్’ ట్రైలర్ రిలీజ్..
ఆహా ఇప్పుడు మరో కొత్త సిరీస్ తీసుకొస్తుంది.

Aha Vere Level Office Series Trailer Released
Vere Level Office : రెగ్యులర్ గా కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రేక్షకులను మెప్పిస్తుంది ఆహా ఓటీటీ. ఇప్పటికే పలు సిరీస్ లతో మెప్పించిన ఆహా ఇప్పుడు మరో కొత్త సిరీస్ తీసుకొస్తుంది. వేరే లెవెల్ ఆఫీస్ అనే టైటిల్ తో కామెడీ ఎంటర్టైన్మెంట్ గా సాగే ఆఫీస్ కథలతో సిరీస్ రాబోతుంది. డిసెంబర్ 12 నుంచి ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అన్ని ఎపిసోడ్స్ ఒకేసారి కాకుండా కొత్త ఎపిసోడ్స్ ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 7 గంటలకు స్ట్రీమింగ్ అవ్వనున్నాయి.
వరుణ్ చౌదరి నిర్మాణంలో సత్తిబాబు దర్శకత్వంలో వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ తెరకెక్కుతుంది. ఇక ఈ సిరీస్ లో ఆర్జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతూ చౌదరి, స్వాతి, వాసంతిక, మహేష్ విట్టా.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఆఫీస్, అందులో సీనియర్ ఎంప్లాయిస్, జూనియర్ ఎంప్లాయిస్.. రకరకాల క్యారెక్టర్స్ తో సాగనుంది. ఈ ట్రైలర్ లో ఇందులో నటించే అందరి క్యారెక్టర్స్ ని పరిచయం చేసారు. తమిళంలో వేరే మాదిరి ఆఫీస్ వెబ్ సిరీస్ ని తెలుగులో ఇలా వేరే లెవల్ ఆఫీస్ గా రీమేక్ చేస్తున్నారు. ఇది మొత్తం 50 ఎపిసోడ్స్ ఉండటం విశేషం.
మీరు కూడా వేరే లెవెల్ ఆఫీస్ ట్రైలర్ చూసేయండి..