Shanmukh Jaswanth: బిగ్‌బాస్ నుంచి షణ్ముక్ ఔట్..?

బుల్లితెరపై మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ‘బిగ్ బాస్’ వచ్చేస్తోంది. ఇప్పటికే నాలుగు సీజన్లు ఎంతగానో అలరించగా.. ఈ షోలో ఎంట్రీ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారు సెలబ్రిటీలు.

Shanmukh

Star Maa: బుల్లితెరపై మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ‘బిగ్ బాస్’ వచ్చేస్తోంది. ఇప్పటికే నాలుగు సీజన్లు ఎంతగానో అలరించగా.. ఈ షోలో ఎంట్రీ కోసం ఎంతగానో ట్రై చేస్తున్నారు సెలబ్రిటీలు. ఇప్పటికే షో విషయంలో వస్తున్న ప్రతీ వార్త ఇంట్రస్టింగ్‌గా ఉండగా.. స్టార్ మా నిర్వహిస్తున్న ఈ షో..లో పాల్గొనే కంటెస్టెంట్‌ల విషయంలో రోజుకో వార్త బయటకు వస్తూనే ఉంది. ఈ సీజన్‌లో కచ్చితంగా కనిపిస్తారని భావించిన కంటెస్టెంట్ షణ్ముక్ జశ్వంత్.

అయితే, మరికొద్దిరోజుల్లో లైవ్‌లోకి ప్రోగ్రామ్ వస్తుంది అని భావించిన సమయంలో రెమ్యూనరేషన్ డిఫరెన్స్ కారణంగా బిగ్‌బాస్ అవకాశం షణ్ముఖ్ జస్వంత్ నుంచి చేజారిపోయింది. ‘ది సాఫ్ట్ వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్‌తో యూట్యూబ్ ద్వారా మంచి హైప్ సాధించిన జశ్వంత్‌కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దాదాపుగా రూ. కోటి తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చినా.. చివరకు షణ్ముఖ్ జస్వంత్‌ను స్టార్ మా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఒక్క కంటెస్టెంట్‌కు అంత ఇస్తే వర్క్ఔట్ కాదని, ఈమేరకు స్టార్ మా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక లోబో, యాంకర్‌ ప్రత్యూష, హీరోయిన్‌ ఈషా చావ్లా, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, యాంకర్‌ వర్షిణి, బుల్లితెర నటి నవ్యస్వామి, పూనం భాజ్వా, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, జబర్దస్త్‌ ప్రియాంక, యానీ మాస్టర్‌, కార్తీక దీపం ఫేమ్‌ ఉమా దేవి, యాంకర్‌ శివ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వచ్చే నెల(సెప్టెంబర్) 5వ తేదీ నుంచి ఈ ప్రోగ్రామ్ లైవ్‌లోకి రానుంది.