సైరా – వాయిస్ ఓవర్ స్టార్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి.. చిత్రానికి ప్రారంభంలో మరియు క్లైమాక్స్‌లో వచ్చే వాయిస్ ఓవర్‌ను కమల్ హాసన్, మోహన్ లాల్, పవన్ కళ్యాణ్ చెప్పారు.

  • Publish Date - September 30, 2019 / 09:25 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి.. చిత్రానికి ప్రారంభంలో మరియు క్లైమాక్స్‌లో వచ్చే వాయిస్ ఓవర్‌ను కమల్ హాసన్, మోహన్ లాల్, పవన్ కళ్యాణ్ చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి.. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గాంధీ జయంతి సందర్భంగా తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ మరియు మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభంలో, క్లైమాక్స్‌లో వచ్చే వాయిస్ ఓవర్‌ను ముగ్గురు బిగ్ స్టార్స్ చెప్పడం విశేషం..

తమిళ్ వెర్షన్‌కు ‘యూనివర్సల్ స్టార్’ కమల్ హాసన్, మళయాల వెర్షన్‌కు ‘కంప్లీట్ యాక్టర్’ మోహన్ లాల్, తెలుగు వెర్షన్‌కు ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ వాయిస్ చెప్పారు. తెలుగు వెర్షన్‌ టీజర్‌లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బిగ్ బి’ అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు..

Read Also : బైపాస్ రోడ్ – ట్రైలర్..

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో,  శ్రీమతి సురేఖ సమర్పణలో.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, ‘మెగా పవర్‌స్టార్’ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.. సంగీతం : అమిత్ త్రివేది, కెమెరా : రత్నవేలు, ఎడిటింగ్ : ఎ.శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్ నంబియార్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : కమల్ కణ్ణన్.