మెగాస్టార్ ‘సైరా’ చూసిన స్టైలిష్ స్టార్

ఏఎంబీ సినిమాస్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ‘సైరా’ మూవీ చూశాడు..

  • Publish Date - October 3, 2019 / 11:44 AM IST

ఏఎంబీ సినిమాస్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ‘సైరా’ మూవీ చూశాడు..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ.. సైరా నరసింహారెడ్డి.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది.  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సైరా మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

పలువురు సెలబ్రిటీలు సైరా చూసి సోషల్ మీడియా ద్వారా రెస్పాన్స్ తెలియచేస్తున్నారు. రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సైరా మూవీ చూశాడు.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌లో బన్నీ సైరా సినిమా చూడడానికి రావడంతో ప్రేక్షకులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు.

థియేటర్ యాజమాన్యం బన్నీ ఫ్యామిలీకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. సైరా ఘనవిజయాన్ని పురస్కరించుకుని ‘థాంక్యూమీట్’ ఏర్పాటు చేసింది మూవీ టీమ్.