stylist sadhna singh sensational post on samantha second marriage
Sadhna Singh: గత కొంత కాలంగా సమంత, దర్శకుడు రాజ్ రిలేషన్ లో ఉన్నారు అంటూ వచ్చిన వార్తలు నేపధ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ ఇద్దరు. తాజాగా సమంత-రాజ్ నిడిమోరు కోయంబత్తూర్ లోని ఈశా ఆశ్రమంలో జరిగింది. ఇక పెళ్లి అనంతరం సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఫోటోలను రిలీజ్ చేసి పెళ్లిని అధికారికంగా ప్రకటించింది. దీంతో నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సమంత రెండవ పెళ్లిపై నెగిటీవ్ కామెంట్స్ కూడా ఒక రేంజ్ లో వస్తున్నాయి.
ఇప్పటికే ఈ పెళ్లిపై నటి పూనమ్ కౌర్, రాజ్ నిడిమోరు మొదటి భార్య నెగిటీవ్ కామెంట్స్ చేయగా.. తాజాగా ఈ లిస్టులో సమంత స్టైలిస్ట్ సద్నా సింగ్(Sadhna Singh) చేరింది. ఆమె సైతం తన సోషల్ మీడియాలో సమంత పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసింది. ‘బాధితురాలిగా.. విలన్ చాలా బాగానే నటించింది’ అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది. దీంతో ఆమె పెట్టిన ఈ స్టోరీ వైరల్ అయ్యింది. అలాగే, స్టోరీ పెట్టిన అనంతరం సమంతను అన్‌ఫాలో చేసింది సద్నా సింగ్. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సమంతను విలన్ అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెటిజన్స్ సైతం ఈ పోస్టులు చూసి షాక్ అవుతున్నారు. అసలు సమంత బాదితురాలా.. విలనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Stylist Sadhna Singh sensational post on Samantha second marriage