Sudha Kongara : రతన్‌టాటా బయోపిక్‌పై స్పందించిన సుధా కొంగర..

సినీపరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువమంది ఉంటారు. కానీ ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకురాలు “సుధ కొంగర”. కాగా ఇటీవల ఈ లేడీ డైరెక్టర్ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలో ఒకరైన రతన్ టాటా బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తపై ఆమె స్పదించింది.

Sudha Kongara : రతన్‌టాటా బయోపిక్‌పై స్పందించిన సుధా కొంగర..

Sudha Kongara gives clarity about ratan tata biopic

Updated On : December 4, 2022 / 9:54 PM IST

Sudha Kongara : సినీపరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువమంది ఉంటారు. ఒకవేళ ఉన్న పెద్దగా గుర్తింపుని సంపాదించుకున్న సంఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకున్న దర్శకురాలు “సుధ కొంగర”. తెలుగు సినిమా ‘ఆంధ్రా అందగాడు’తో దర్శకురాలిగా మెగా ఫోన్ పట్టుకున్న సుధా తక్కువ కాలంలోనే టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయింది.

Hansika marriage : వాళ్ళు సెలెబ్రెటీస్ కాదు.. కానీ హన్సిక పెళ్ళికి ముఖ్య అథిలుగా వెళ్తున్నారు.. ఎవరో తెలుసా?
బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ‘గురు’ సినిమాతో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ఈ లేడీ డైరెక్టర్.. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డుని కైవసం చేసుకుంది. దీంతో ఈ దర్శకురాలి తదుపరి ప్రాజెక్ట్ పై అందరి ద్రుష్టి పడింది. ఈ నేపథ్యంలోనే ఆమె, దేశంలోని ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలో ఒకరైన రతన్ టాటా బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల కొన్ని కథనాలు వచ్చాయి.

తాజాగా ఈ వార్తపై ఆమె స్పదించింది. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేసింది. నేను రతన్ టాటా కి వీరాభిమానిని, కానీ ప్రస్తుతం అయన బయోపిక్ తెరకెక్కించే ఆలోచన లేనట్లు చెప్పింది. త్వరలోనే తన కొత్త సినిమా వివరాలను అధికారికంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె అక్షయ్ కుమార్ తో హిందీలో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను రీమేక్ చేస్తుంది.