Sudheer Babu Harom Hara movie Teaser released by Prabhas
Harom Hara Teaser : నైట్రో స్టార్ సుధీర్ బాబుకి ‘సమ్మోహనం’ తరువాత ఆ రేంజ్ హిట్టు పడలేదు. మధ్యలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ పర్వాలేదు అనిపించుకుంది. ఈ ఏడాది హంట్, మామా మశ్చీంద్ర సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా అవి డిజాస్టర్స్ గా నిలిచాయి. దీంతో ఈసారి ఎలాగైనా ఒక మంచి హిట్టు అందుకోవాలని ‘హరోంహర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇక ఈ పాన్ ఇండియా చిత్రం కోసం ప్రభాస్ తన సహాయం అందిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ ని నేడు రిలీజ్ చేయడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేశారు. తెలుగు టీజర్ ని ప్రభాస్ చేతులు మీదుగా రిలీజ్ చేశారు. అలాగే కన్నడ టీజర్ కిచ్చా సుదీప్, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మమ్ముట్టి, హిందీలో టైగర్ ష్రాఫ్ రిలీజ్ చేశారు. 1980’s బ్యాక్‌డ్రాప్‌లో కుప్పం ప్రాతంలో ఈ సినిమా కథ జరగనుంది. టీజర్ చూస్తుంటే రూరల్ గ్యాంగ్ స్టార్ మూవీ అని తెలుస్తుంది. సుధీర్ బాబు నుంచి ఒక కంప్లీట్ మాస్ సంభవం చూపించబోతున్నారు. మొదటి సినిమాని రొమాంటిక్ కామెడీగా తెరకెక్కించిన జ్ఞానసాగర్.. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించినట్లు తెలుస్తుంది టీజర్ చూస్తుంటే.
Also read : Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ గ్లింప్స్ వచ్చేసింది.. ఫస్ట్ పార్ట్‌కి మించి..
‘సెహరి’ మూవీ దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్న ఈ మూవీతో అయినా సుధీర్ బాబు హిట్టు అందుకుంటాడేమో చూడాలి.