×
Ad

Krishna : శివుడిగా కృష్ణ ను చూపించబోతున్నారా..? కృష్ణ అల్లుడి సినిమాలో..

ఏ అవకాశం ఉన్నా కథలో దేవుళ్ళ పాత్రలను తీసుకొస్తున్నారు. (Krishna)

Krishna

Krishna : ఇటీవల చాలా సినిమాలు డివోషనల్ కథను టచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి దేవుళ్లను తీసుకొస్తున్నారు. దేవుళ్ళ కథలు టచ్ చేయడంతో సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో ఏ అవకాశం ఉన్నా కథలో దేవుళ్ళ పాత్రలను తీసుకొస్తున్నారు. ఇప్పుడు హీరో సుధీర్ బాబు సినిమాలో కూడా దైవత్వం చూపించబోతున్నారు.(Krishna)

మహేష్ బాబు బావ, కృష్ణ అల్లుడు సుధీర్ బాబు హీరోగా జటాధరా సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. లంకె బిందెలు, దానికి కాపలా ఉండే ఓ దయ్యం అనే కథతో ఈ సినిమా రాబోతున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో శివుడు నడిచి వచ్చినట్టు కాళ్ళు వరకు చూపించారు.

Also Read : Indraaniel : సీరియల్ కోసం.. రామ్ చరణ్ సినిమాని రిజెక్ట్ చేసిన నటుడు..

తాజాగా సుధీర్ బాబు మీడియాతో మాట్లాడగా ఈ సినిమాలో శివుడు ఎలా కనిపించబోతారో చెప్పారు. సుధీర్ బాబు మాట్లాడుతూ.. సినిమా చివర్లో శివుడు వస్తాడు. ఆయన రావడంతోనే కథ ముగుస్తుంది. అయితే సినిమాలో శివుడిగా ముందు కృష్ణ గారినే చూపిద్దాం అనుకున్నాము. గ్రాఫిక్స్, AI వాడి కృష్ణ గారిని చూపిద్దాం అనుకున్నాము. కానీ తర్వాత ఆ నిర్ణయం మారింది. ఇప్పుడు సినిమాలో డైరెక్ట్ శివుడి ఫేస్ చూపించము. పక్కనుంచి, సైడ్ యాంగిల్స్ లోనే ఫేస్ కనిపించకుండానే శివుడు వచ్చినట్టు చుపిస్తాము అని చెప్పారు.

దీంతో సుధీర్ బాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే కృష్ణని శివుడిగా చూపించి ఉంటే బాగుండేది అని, ఆయన లేకపోయినా మళ్ళీ తెరపై ఆయన్ని చూసిన ఫీలింగ్ ఉండేది అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also See : Kajal Aggarwal : భర్తతో కాజల్ అగర్వాల్ వెకేషన్.. ఆస్ట్రేలియాలో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు..