Maama Mascheendra : మామా మశ్చీంద్ర మూవీ రివ్యూ.. మూడు పాత్రలతో సుధీర్ బాబు మెప్పించాడా?

సినిమాలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్‌లో నటించాడు. ఒక పాత్ర ఓల్డ్ గెటప్ లో ఉంటే, మరో పాత్ర యంగ్ అండ్ స్టైలిష్ గా, మూడో పాత్ర లావుగా ఉండబోతున్నట్టు ట్రైలర్ లో చూపించి సినిమాపై ఆసక్తి పెంచారు.

Maama Mascheendra Movie : సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా సుధీర్ బాబు (Sudheer Babu) వరుసగా కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘మామా మశ్చీంద్రా’ అనే సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు సుధీర్ బాబు. ఈ సినిమాలో సుధీర్ బాబు ట్రిపుల్ రోల్‌లో నటించాడు. ఒక పాత్ర ఓల్డ్ గెటప్ లో ఉంటే, మరో పాత్ర యంగ్ అండ్ స్టైలిష్ గా, మూడో పాత్ర లావుగా ఉండబోతున్నట్టు ట్రైలర్ లో చూపించి సినిమాపై ఆసక్తి పెంచారు. ఈ సినిమాలో ఈషరెబ్బ, మృణాళిని రవి హీరోయిన్స్ గా నటించగా అభినయ, అజయ్, హర్షవర్ధన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాని హర్షవర్ధన్ తెరకెక్కించాడు.

కథ విషయానికి వస్తే పరుశురాం(సుధీర్ బాబు) చిన్నప్పుడే వాళ్ళ నాన్న వేరే అమ్మాయి కోసం, ఆస్తి కోసం తన అమ్మని చంపేయడంతో నాన్నని, ఆ అమ్మాయిని చంపి విలన్ గా మారతాడు. జైలుకి వెళ్లొచ్చి కేవలం డబ్బులే జీవితం అన్నట్టు మామ ఆస్తి కోసం ట్రై చేస్తాడు. తనకి పాప పుట్టాక భార్య, మామ అనుకోకుండా చనిపోవడంతో ఆస్తి కోసం తన కింద పనిచేసే రామదాసుతో మామ పిల్లలని, మనవళ్ళని కూడా చంపమని చెప్తాడు. చివరి నిమిషంలో వాళ్ళు మిస్ అవుతారు. రామదాసు మీద కోపంతో అప్పుడే ఇద్దరికి పాప పుట్టడంతో ఆ పాపలని మార్చేసి ఇద్దర్ని సొంత కూతుర్లులా చూసుకుంటాను అంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పరుశురాం పోలికలతో ఉన్న ఇద్దరు కుర్రాళ్ళు పరుశురాం, రామదాసు కూతుళ్ళ వెనక పడటంతో వాళ్ళని చంపడానికి వెళ్తాడు. చిన్నపుడు మిస్ అయిన పిల్లలు వీళ్లేనా? పగ తీర్చుకోవడానికి ప్రేమించారా? లేదా అసలు పరుశురాం వీళ్ళ మామ అని తెలుసా? ఈ ఇద్దరి హీరోలు, హీరోయిన్స్ ల ప్రేమ కథేంటి? సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ఏంటి అనేది తెరపై చూడాల్సిందే.

కథనం విషయానికి వస్తే.. ప్రస్తుతం, గతం, ముగ్గురు సుధీర్ బాబులు, వాళ్ళ సపరేట్ కథలు, ఇద్దరు హీరోయిన్స్, హర్షవర్ధన్ కథ, ఇద్దరు అజయ్ లు.. ఇలా చాలా గందరగోళంగా సాగుతుంది సినిమా అంతా. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సాధారణ ప్రేక్షకులకు అక్కడక్కడా కన్ఫ్యూజన్ రాక తప్పదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఉండే ట్విస్ట్ లు బాగుంటాయి. అక్కడక్కడా కొంచెం కామెడీ వర్కౌట్ అయింది.

Also Read : 800 Movie : ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ మూవీ రివ్యూ.. తప్పకుండా చూడాల్సిన బయోపిక్..

సుధీర్ బాబు మూడు పాత్రల్లో బాగా కష్టపడ్డాడని చెప్పొచ్చు. మూడు పాత్రల్లో వ్యత్యాసం బాగా చూపించి మెప్పించాడు. హీరోయిన్స్ ఈషా, మృణాళిని కూడా మెప్పించారు. హర్షవర్ధన్, మిగిలిన పాత్రలు కూడా ఓకే అనిపించాయి. ఆర్జీవీ క్యారెక్టర్ లో షకలక శంకర్ కాసేపు మెప్పించి ఎంటర్టైన్ చేశాడు. ఆర్టిస్టులు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా సినిమా మాత్రం అర్ధమవ్వాలంటే కొంచెం కష్టమే. ఈ సినిమాకు రేటింగ్ 2.5 వరకు ఇవ్వొచ్చు.

గమనిక : ఈ రివ్యూ, రేటింగ్ కేవలం విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే..

ట్రెండింగ్ వార్తలు