Sudigali Sudheer : G.O.A.T అంటున్న సుడిగాలి సుధీర్.. ఏ విషయంలో అంటారు?

సుడిగాలి సుధీర్ తన 4వ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. G.O.A.T - Greatest Of All Times అంటున్నాడు. అది ఏ విషయంలో అంటారు?

Sudigali Sudheer Divya Bharathi movie titled as GOAT

Sudigali Sudheer G.O.A.T : సుడిగాలి సుధీర్ హీరోగా తన 4వ సినిమాని ఇటీవల ప్రకటించాడు. పాగల్ అవంతి రొమాంటిక్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించిన నరేష్ కుప్పిలి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బ్యాచిలర్ ఫేమ్ దివ్య భారతి (Divya Bharathi) నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఇక నేడు (మే 19) సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్బంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను గ్రాండ్ గా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ మూవీకి G.O.A.T అనే ఇంగ్లీష్ టైటిల్ ని ఖరారు చేశారు.

Ram Charan : ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్‌ని జనసేనకి అందించిన చరణ్ అభిమానులు.. ఎంతో తెలుసా?

Greatest Of All Times అనే ట్యాగ్ లైన్ తో ఈ టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ టైటిల్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది. ఒక గోడ మీద అమ్మాయి అబ్బాయి పేరులు రాసి లవ్ సింబల్స్ తో కనిపిస్తుంది. G.O.A.T అంటుంది ప్రేమ విషయాల్లోనేనా? ఆ పోస్టర్ చూస్తుంటే మంచి లవ్ స్టోరీతో కూడిన కథ అని తెలుస్తుంది. సుధీర్, దివ్య భారతి కాంబినేషన్ కూడా ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ పై చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మరియు బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Rashmika Mandanna : ఐశ్వర్య, రష్మిక వివాదం.. రెస్పాండ్ అయిన రష్మిక.. వివరణ ఇవ్వాల్సిన!

ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నామని, నిర్మాణంలో ఎక్కడా బడ్జెట్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మిస్తున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. సినిమాలోనే కథ ప్రేక్షకులని అందర్నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. సినిమాకు తగ్గట్టే లియో మంచి మ్యూజిక్ అందిస్తున్నట్లు వెల్లడించాడు. సినిమాని శరవేగంగా పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామని తెలియజేసిన చిత్ర యూనిట్.. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామంటూ వెల్లడించారు.