Sudigali Sudheer starts Pan World movie
Sudigali Sudheer: జబర్దస్త్ సుడిగాలి సుధీర్ ఆడియన్స్ కి షాక్ ఇచ్చాడు. మన స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే. సుధీర్ మాత్రం ఏకంగా పాన్ వరల్డ్ సినిమాను మొదలుపెట్టేస్తున్నాడు. దానికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి సంబందించిన టైటిల్ ఇవాళ రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. నిజానికి, సుడిగాలి సుధీర్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. కమెడియన్ నుంచి (Sudigali Sudheer)యాంకర్.. యాంకర్ నుంచి హీరోగా మారిన సుధీర్ కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
Raja Saab Trailer: రెబల్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రాజా సాబ్ ట్రైలర్ డేట్ వచ్చేసింది
ఈ మధ్య వచ్చిన గాలోడు సినిమా హీరోగా ఆయనకు మంచి విజయాన్ని అందించింది. సినిమాలో పెద్దగా ఎం లేకపోయినా కేవలం సుధీర్ క్రేజ్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ మూవీ. ఆ తరువాత కాలింగ్ సహస్ర అనే థ్రిల్లర్ మూవీ చేశాడు సుధీర్. మంచి మంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది. ఆ తరువాత మళ్ళీ టీవీకి షిఫ్ట్ అయిన సుధీర్ హోస్టింగ్ చూస్తూ వచ్చాడు. ఇప్పుడు దాదాపు ఏడాది గ్యాప్ తరువాత మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఆయన కెరీర్ లో 5 వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ ఇవాళ (సెప్టెంబర్ 29) న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు “హైలెస్సో” అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నార మేకర్స్. చాలా కొత్తగా ఈ సినిమా ఉండబోతుంది అని టాక్. దసరా కానుకగా తన ఈ కొత్త సినిమాను మొదలుపెట్టనున్నాడు.
అయితే, గతంలో లాగా రీజనల్ సినిమాతో కాకుండా ఈసారి ఏకంగా పాన్ వరల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుధీర్. రెగ్యులర్ కథలు కాకుండా కాస్త కొత్తదనం ఉన్న కథలతో ఆడియన్స్ ముందుకు రావాలని, ఆది సెట్ చేసుకోవడానికే ఇంతకాలం పట్టింది అని తెలుస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొన్నటివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వద్ద పీఆర్ గా చేసిన శివ చెర్రీ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. మరి చాలా గ్యాప్ తరువాత సుధీర్ చేస్తున్న ఈ సినిమా ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుంది అనేది చూడాలి.