Ambajipeta Marriage Band : అదరగొట్టిన అంబాజీపేట.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా థియేటర్స్ దూసుకుపోతుంది.

Ambajipeta Marriage Band : అదరగొట్టిన అంబాజీపేట.. రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Suhas Ambajipeta Marriage Band Two Days Collections Full Details

Updated On : February 4, 2024 / 3:01 PM IST

Ambajipeta Marriage Band Collections : సుహాస్(Suhas), శివాని(Shivani) జంటగా తెరకెక్కిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్త నిర్మాణంలో దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. ఈ సినిమాలో నితిన్, శరణ్య, జగదీశ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

రిలీజ్ కి ముందు రోజే ప్రీమియర్స్ వేయడంతో అప్పట్నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా. సినిమాలో సుహాస్, శరణ్య యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. నవ్వించి, ఏడిపించారు ప్రేక్షకులని. ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా థియేటర్స్ దూసుకుపోతుంది.

Also Read : Bunny Vasu : అల్లు అర్జున్ కథలు వినాలంటే అతను ఉండాల్సిందే.. బన్నీవాసు ఆసక్తికర వ్యాఖ్యలు..

అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా మొదటి రోజే 2.28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా రెండు రోజులకు 5.16 కోట్లు కలెక్ట్ చేసింది. నేడు హాలిడే కావడంతో ఈ రోజు కూడా కలెక్షన్స్ బాగా వస్తాయని అంచనా. ఇక అమెరికాలో కూడా ఇప్పటికే 100K డాలర్స్ వసూలు చేసింది ఈ సినిమా. అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఈజీగా 10 కోట్ల కలెక్షన్స్ దాటేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాతో సుహాస్ హీరోగా హ్యాట్రిక్ కొట్టాడు.

View this post on Instagram

A post shared by Suhas (@suhassssssss)