Suhas Gorre Puranam Movie Release Date Announced
Gorre Puranam : బ్యాక్ టు బ్యాక్ హీరోగా మంచి కంటెంట్ సినిమాలతో వచ్చి హిట్లు కొడుతున్న సుహాస్ తాజాగా మరో సినిమాతో రాబోతున్నాడు. సుహాస్ జనక అయితే గనక సినిమా సెప్టెంబర్ 13 రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు కారణాలతో ఆ సినిమా వాయిదా పడింది. అయినా అతన నెక్స్ట్ సినిమాని రిలీజ్ కి రెడీ చేసాడు. ‘గొర్రె పురాణం’ అనే కొత్త కథతో సుహాస్ సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సుహాస్ హీరోగా ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై బాబీ దర్శకత్వం లో ప్రవీణ్ రెడ్డి నిర్మాణంలో ఈ ‘గొర్రె పురాణం’ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గతంలో టీజర్ రిలీజ్ చేయగా మంచి ఆసక్తి నెలకొంది.
ఒక గొర్రె కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఒక ఊళ్ళో హిందూ ముస్లింల మధ్య ఒక గొర్రె ఎలా చిచ్చు పెట్టింది, ఆ గొడవలోకి సుహాస్ ఎలా వచ్చాడు అని ఆసక్తికర కథతో తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో గొర్రెకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం గమనార్హం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతున్న ఈ గొర్రె పురాణం సినిమా ప్రమోషన్స్ తాజాగా మొదలుపెట్టారు.