Janaka Aithe Ganaka : సుహాస్ ‘జనక అయితే గనక’ ట్రైలర్ రిలీజ్.. కండోమ్ పనిచేయలేదని కేసు పెడితే..

తాజాగా జనక అయితే గనక సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Janaka Aithe Ganaka : సుహాస్ ‘జనక అయితే గనక’ ట్రైలర్ రిలీజ్.. కండోమ్ పనిచేయలేదని కేసు పెడితే..

Suhas Janaka Aithe Ganaka Trailer Released

Updated On : August 27, 2024 / 5:26 PM IST

Janaka Aithe Ganaka Trailer : సుహాస్ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. తన నెక్స్ట్ సినిమా ‘జ‌న‌క అయితే గ‌న‌క’ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై హర్షిత్‌రెడ్డి, హన్షిత నిర్మాణంలో సందీప్ రెడ్డి బండ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సంగీర్త‌న విపిన్ హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్ర‌సాద్, గోపరాజు రమ‌ణ.. పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Pawan Kalyan – OG : పవన్ కోసం విజయవాడలో ముంబై సెట్..? OG సినిమా కోసం..

ఇప్పటికే జ‌న‌క అయితే గ‌న‌క టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి పిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువవుతాయని పిల్లలు వద్దనుకుంటాడు. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం పిల్లలు కావాలనుకుంటారు. ఓ రోజు తన భార్య ప్రగ్నెంట్ అని చెప్పడంతో కండోమ్ సరిగ్గా పనిచేయలేదని కేసు వేస్తాడు హీరో. ట్రైలర్ ఆద్యంతం నవ్విస్తూనే ఒక ఎమోషన్ ని కూడా చూపించారు. ట్రైలర్ చూస్తుంటే సుహాస్ జ‌న‌క అయితే గ‌న‌క సినిమాతో మరోసారి హిట్ కొట్టనున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా జ‌న‌క అయితే గ‌న‌క ట్రైలర్ చూసేయండి..