×
Ad

Sujeeth : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కి నో చెప్పిన సుజీత్.. తన ఫేవరేట్ హీరో కోసం..

OG సక్సెస్ తర్వాత సుజీత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుజీత్. (Sujeeth)

Sujeeth

Sujeeth : డైరెక్టర్ సుజీత్ తాజాగా తన ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ తో OG సినిమా తీసి అదిరిపోయే హిట్ కొట్టాడు. పవన్ ఫ్యాన్స్ కొన్నేళ్ల పాటు చెప్పుకునే విధంగా పవన్ కళ్యాణ్ ని చూపించి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం సుజీత్ OG సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత నానితో సినిమా చేయబోతున్నాడు.(Sujeeth)

అయితే సుజీత్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తోనే సినిమా వదులుకున్నాడని తెలుస్తుంది. OG సక్సెస్ తర్వాత సుజీత్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.

Also Read : OG Collections : పవర్ స్టార్ OG ఫస్ట్ డే కలెక్షన్స్.. అఫీషియల్ అనౌన్స్.. ఇది కదా పవన్ కళ్యాణ్ రేంజ్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుజీత్ మాట్లాడుతూ.. సాహో తర్వాత ఇక్కడ కొన్ని ప్రయత్నాలు చేశాను వర్కౌట్ అవ్వకపోవడంతో బాలీవుడ్ వెళ్ళాను. అక్కడ టాప్ హీరోతో సినిమా ఓకే అయింది. నిర్మాణ సంస్థ కూడా రెడీ అయింది. కానీ అదే సమయంలో త్రివిక్రమ్ గారు, దానయ్య గారు ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా అని చెప్పారు. అప్పుడు రెండిట్లో ఏదో తేల్చుకోలేకపోయాను. అప్పటికే చాలా రోజులుగా ఖాళీగా ఉన్నాను. బాలీవుడ్ లో ఓకే అయిన సినిమాని వదిలేసుకుంటే ఎలా అని ఆలోచించాను. రెండు పడవల మీద కాలు పెట్టాలని కూడా అనుకున్నాను.

కానీ చివరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాను ఓకే చేసి బాలీవుడ్ సినిమాకు సారీ చెప్పి వచ్చేసాను. చిన్నప్పట్నుంచి ఆయన్ని కలిస్తే చాలు అనుకున్నా. సినీ పరిశ్రమలోకి వచ్చినా ఎప్పుడూ ఆయనతో సినిమా చేస్తానని అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు పవన్ గారితో సినిమా ఛాన్స్ వస్తే ఎలా వదులుకుంటాను. అందుకే బాలీవుడ్ సినిమా వదిలేసి పవన్ గారి సినిమా చేశాను అని తెలిపాడు.

Also Read : OG 2 : ఓజీ సీక్వెల్ కాదా? ప్రీక్వెల్..? సుభాష్ చంద్రబోస్ తో లింక్.. OG పార్ట్ 2 కథ ఇదే..

అయితే సుజీత్ వదిలేసిన బాలీవుడ్ సినిమా షారుఖ్ ఖాన్ తోనే అని అంతా అంటున్నారు. గతంలో సాహో తర్వాత సుజీత్ – షారుఖ్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. సుజీత్ కూడా వెళ్లి షారుఖ్ ని కలిసి కథ చెప్పాడు. సుజీత్ – షారుఖ్ కలిసి దిగిన ఫోటో కూడా వైరల్ అయింది. దీంతో సుజీత్ వదిలేసింది షారుఖ్ ఖాన్ సినిమానే అని అంతా భావిస్తున్నారు.