OG Collections : పవర్ స్టార్ OG ఫస్ట్ డే కలెక్షన్స్.. అఫీషియల్ అనౌన్స్.. ఇది కదా పవన్ కళ్యాణ్ రేంజ్..

తాజాగా మూవీ యూనిట్ OG మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించింది. (OG Collections)

OG Collections : పవర్ స్టార్ OG ఫస్ట్ డే కలెక్షన్స్.. అఫీషియల్ అనౌన్స్.. ఇది కదా పవన్ కళ్యాణ్ రేంజ్..

OG Collections

Updated On : September 26, 2025 / 3:39 PM IST

OG Collections : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా నిన్న రిలీజయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని థియేటర్స్ లో దూసుకుపోతుంది ఈ సినిమా. OG కలెక్షన్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ తోనే OG సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం అడ్వాన్స్, ప్రీమియర్స్ బుకింగ్స్ తోనే OG సినిమా రిలీజ్ కి ముందే దాదాపు 90 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.(OG Collections)

తాజాగా మూవీ యూనిట్ OG మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించింది. OG సినిమా ప్రీమియర్స్, మొదటి రోజు కలుపుకొని ఏకంగా 154 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2025 లో అత్యధికంగా మొదటి రోజు కలెక్షన్స్ సాధించిన సినిమా కూలీ. 151 కోట్లు రజినీకాంత్ కూలీ వసూలు చేయగా దాన్ని బీట్ చేసి OG సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. నార్త్ అమెరికాలో మొదటి రోజుకి 3.4 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. అంటే ఆల్మోస్ట్ 28 కోట్లు అమెరికా నుంచే వచ్చాయి.

Also Read : Aadya : OG హుడీతో పవన్ కూతురు.. నాన్న సినిమా కోసం అంటూ.. స్పెషల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్..

Image

OG సినిమాకు థియేట్రికల్ బిజినెస్ దాదాపు 175 కోట్లకు జరిగింది. అంటే ఆల్మోస్ట్ గ్రాస్ 350 కోట్లు వసూలు చేయాలి. మొదటి రోజే ఆల్మోస్ట్ సగం కలెక్షన్స్ రాబట్టేసింది OG. దసరా హాలిడేస్, వీకెండ్, వేరే సినిమాలు ఏమి లేకపోవడం.. ఇవన్నీ OG కి కలిసొచ్చి ఈజీగా ఈ వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ అయిపోయి కలెక్షన్స్ పరంగా హిట్ అవుతుంది అని అంచనా వేస్తున్నారు.

Also See : OG Working Stills : పవన్ కళ్యాణ్ OG సినిమా వర్కింగ్ స్టిల్స్ చూశారా..?