Sujeeth: మళ్లీ మొదటికే వచ్చిన సాహో డైరెక్టర్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సాహో వంటి బిగ్ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసిన యంగ్ డైరెక్టర్ సుజీత్, ఆ సినిమా రిజల్ట్‌తో ఒక్కసారిగా అతడి కెరీర్.....

Sujeeth To Do Movie With Sharwanand

Sujeeth: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సాహో వంటి బిగ్ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేసిన యంగ్ డైరెక్టర్ సుజీత్, ఆ సినిమా రిజల్ట్‌తో ఒక్కసారిగా అతడి కెరీర్ మారిపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలవడంతో, భారీ చిత్రాలను హ్యాండిల్ చేయడం ఈ డైరెక్టర్‌తో కాని పని అంటూ చాలా మంది స్టార్ హీరోలు అతడికి నో చెబుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇవన్నీ లెక్కచేయని మెగాస్టార్ చిరంజీవి, సుజీత్‌కు ఓ అవకాశం ఇచ్చాడు.

కానీ.. తన కథతో మెగాస్టార్‌ను కూడా ఇంప్రెస్ చేయలేకపోయాడు ఈ డైరెక్టర్. దీంతో సుజీత్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో తీస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఓ కథను వినిపించాలని చాలా ప్రయత్నాలు చేశాడు సుజీత్. కానీ పలు కారణాల వల్ల అది కుదర్లేదు. దీంతో ఇప్పుడు మళ్లీ మొదటికే వచ్చాడట ఈ యంగ్ డైరెక్టర్. తనకు ‘రన్ రాజా రన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ను అందించిన హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేసేందుకు మరోసారి రెడీ అవుతున్నాడు దర్శకుడు సుజీత్.

ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సుజీత్ ఈసారి ఖచ్చితంగా హిట్ కొడితేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సాధ్యమని, లేకపోతే అతడికి మున్ముందు చాలా ఇబ్బందులు తప్పవని పలువరు సినీ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. అటు శర్వానంద్ కూడా సరైన హిట్ టేస్ట్ చేసి చాలా రోజులు అవుతోంది. దీంతో ఆయన కూడా మరోసారి ఈ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇక ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.