Sukumar Learn Some Lessons for Pushpa 2 Movie Shoot from Famous News Anchor Devi Nagavalli
Sukumar : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వచ్చిన పుష్ప(Pushpa) సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరో అవ్వడమే కాక నేషనల్ అవార్డు కూడా సాధించి సత్తా చాటాడు. దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే పుష్ప 2 మీద బాగా వర్క్ చేసి మరీ లేట్ అయినా నిదానంగా తీస్తున్నాడు సుకుమార్.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సుకుమార్ బాగా కష్టపడుతున్నాడు. పుష్ప 2 కోసం సుకుమార్ ఓ యాంకర్ దగ్గర పాఠాలు కూడా నేర్చుకుంటున్నాడట. ఆ యాంకర్ కూడా ఖాళీగా ఉన్నప్పుడల్లా వచ్చి పుష్ప 2 సినిమా కోసం పనిచేస్తుంది. ఇంతకీ ఆ యాంకర్ ఎవరు? అందరికి పాఠాలు చెప్పే లెక్కల మాస్టర్ సుకుమార్ ఆమె దగ్గర ఏం పాఠాలు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారా?
ప్రముఖ న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి(Devi Nagavalli) సుకుమార్ దగ్గర పనిచేస్తున్నారట. న్యూస్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న దేవి నాగవల్లి ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆమెకు సినిమాల మీద మక్కువ ఎక్కువే ఉంది. ఆ విధంగానే కొన్ని రోజులు సుకుమార్ దగ్గర పుష్ప సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తాను అడిగితే సుకుమార్ ఓకే చెప్పినా ఆమెకు ఉన్న వర్క్ షెడ్యూల్స్ వాళ్ళ కుదర్లేదంట. అయితే పుష్ప 2 సినిమాలో పుష్ప రాజ్ కనపడకుండా పోయినప్పుడు మీడియాలో హడావిడి, యాంకర్స్ అతని గురించి చెప్పడం, లైవ్ రిపోర్టింగ్.. ఇలాంటి సీన్స్ అన్ని ఉన్నాయి. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్ లో కూడా దీనికి సంబంధించి కొన్ని సీన్స్ చూపించారు. దీని కోసం సుకుమార్ దేవి నాగవల్లిని పిలిపించారని సమాచారం.
Also Read : Mahesh Babu : 100లో 90 థియేటర్లు మహేష్ బాబుకే.. సంక్రాంతికి గుంటూరు కారం ఘాటు.. ఓపెనింగ్స్ ఎంత?
దేవి నాగవల్లి మీడియాలో చాలా అనుభవం ఉండటంతో ఈ మీడియా ఉన్న సీన్స్ లో ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది? రిపోర్టింగ్, పరికరాలు.. ఇలా వీటన్ని గురించి సుకుమార్ దేవి నాగవల్లి దగ్గర నేర్చుకున్నారట. దీంతో దేవి కూడా అటు సుకుమార్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ సీన్స్ కోసం సుకుమార్ దగ్గర తనకి ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి పనిచేసిందట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. మరి దేవి స్క్రీన్ మీద కనిపిస్తుందా లేక తెరవెనుకే కష్టపడిందా.. ఇదంతా తెలియాలంటే పుష్ప 2 రిలీజ్ వరకు ఆగాల్సిందే.
Also Read : Hanuman : ‘హనుమాన్’ కి ఇన్ని ఇబ్బందులా? ఎవరూ సపోర్ట్ చేయట్లేదా? థియేటర్స్ కూడా దొరకట్లేదా?