Hanuman : ‘హనుమాన్’ కి ఇన్ని ఇబ్బందులా? ఎవరూ సపోర్ట్ చేయట్లేదా? థియేటర్స్ కూడా దొరకట్లేదా?
హనుమాన్ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. మరి థియేటర్స్ దొరుకుతాయా, కలెక్షన్స్ వస్తాయా అనేది ఆలోచించాల్సిందే.

Teja Sajja Hanuman Movie Faces So Much Troubles Cant find Theaters
Hanuman : టాలివుడ్ యంగ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తీసే సినిమాలపై ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన సినిమా హనుమాన్. మన ఆంజనేయస్వామి పాత్రను ఆధారంగా తీసుకొని పల్లెటూళ్ళో నివసించే ఓ కుర్రాడికి హనుమంతుడి శక్తులు వస్తే ఏం జరిగింది అనే కథగా హనుమాన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రానుంది. అయితే సంక్రాంతికి ఈ సారి తెలుగు నుంచే చాలా సినిమాలు ఉండటంతో థియేటర్స్ అందరికి అడ్జస్ట్ చేయాలి. హనుమాన్ సినిమా పరంగా, గ్రాఫిక్స్ పరంగా మంచి పేరొచ్చినా చిన్న సినిమా, చిన్న హీరో కావడంతో థియేటర్స్ దొరకట్లేదని టాక్ వస్తుంది. అటు సంక్రాంతికి మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున, రవితేజ.. లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో హనుమాన్ కి థియేటర్స్ ఎక్కువగా దొరకట్లేదని టాక్ నడుస్తుంది.
ఇక హనుమాన్ టీం ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఆసక్తికర విషయాలని తెలుపుతున్నారు. తాజాగా నటుడు అడివి శేష్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శేష్.. మీకు చాలా సర్కిల్ ఉంది, పెద్ద పెద్ద స్టార్స్ వస్తారు అడిగితే, ఎందుకు ప్రమోషన్స్ వాళ్ళతో చేయించట్లేదు, టీజర్, ట్రైలర్ లాంచ్ లకు రాలేదు అని అడిగారు.
Also Read : Guntur Kaaram : ట్రెండ్ సెట్టర్ మహేష్ బాబు.. మొట్టమొదటిసారి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్..
దీనికి తేజ సజ్జ సమాధానమిస్తూ.. తెలిసినా మనం అంత తొందరగా అడగలేం. అడిగినా అందరూ సపోర్ట్ చేయరు, కొంతమందిని అడిగి చూశాము. వర్కౌట్ అవ్వలేదు. అందుకే మేమే టీజర్ రిలీజ్ చేసి వచ్చే రెస్పాన్స్ బట్టి ముందుకు వెళ్దాం అనుకున్నాం. మంచిరెస్పాన్స్ వచ్చింది. నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయింది అని అన్నాడు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దీని గురించి మాట్లాడుతూ.. మేము కొంతమందిని అడిగాము. వాళ్లకు కుదరలేదు, మేము మళ్ళీ మళ్ళీ అడగలేము. ఒకసారి అడిగాక వాళ్ళు వస్తామని చెప్పి రాకపోయినా, చూద్దాం అని చెప్పినా మళ్ళీ వాళ్ళని అడగలేము అని తెలిపాడు. తేజ అయితే దీని గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కూడా అయ్యాడు. దీంతో హనుమాన్ టీం స్టార్స్ ప్రమోషన్స్ కోసం ట్రై చేసినా పలువురు సపోర్ట్ చేయలేదని తెలుస్తుంది. కథ, టెక్నికల్ పరంగా ఒక మంచి సినిమా వస్తే సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది, ఆ హనుమంతుడికే ఇన్ని కష్టాలా అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
హనుమాన్ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. మరి థియేటర్స్ దొరుకుతాయా, కలెక్షన్స్ వస్తాయా అనేది ఆలోచించాల్సిందే. థియేట్రికల్ బిజినెస్ కూడా హనుమాన్ సినిమా బాగానే చేసింది. ఒక్క నైజాంలోనే దాదాపు 8 కోట్లకు హనుమాన్ థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో కూడా బాగా అమ్ముడుపోయాయి. హనుమాన్ ఇండియాలోనే కాక జాపనీస్, చైనీస్, స్పానిష్.. పలు భాషల్లో రిలీజ్ అవుతుండటంతో అక్కడ కూడా మంచి బిజినెస్ జరిగిందని చిత్రయూనిట్ చెప్తుంది.