Mahesh Babu : 100లో 90 థియేటర్లు మహేష్ బాబుకే.. సంక్రాంతికి గుంటూరు కారం ఘాటు.. ఓపెనింగ్స్ ఎంత?
గుంటూరు కారం కేవలం తెలుగు రిలీజ్ కావడంతో తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ జనవరి 12 అన్ని థియేటర్స్ బాబుకే వెళ్లనున్నాయి.

Mahesh Babu Guntur Kaaram Movie gets More Theaters for Sankranthi on Release Day
Mahesh Babu Guntur Kaaram : త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఈ సంక్రాంతికి జనవరి 12న రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్, పోస్టర్స్ తో సినిమాపై ఊర మాస్ అంచనాలు నెలకొన్నాయి. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
అయితే ఈసారి సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. దీంతో థియేటర్స్ అడ్జస్ట్మెంట్ కష్టంగానే మారింది. పెద్ద సినిమాలకు, ముందు రిలీజ్ అవుతున్న సినిమాలకే ఎక్కువ థియేటర్స్ వెళ్లనున్నాయి. ఇక గుంటూరు కారం సినిమా నైజం హక్కులు దిల్ రాజు తీసుకున్నారు. జనవరి 12న రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమాకు హైదరాబాద్ లో దాదాపు 90 శాతం థియేటర్స్ ఇవ్వనున్నారు. ఇప్పుడు ఏ సినిమాలు లేవు కాబట్టి కుదిరితే 100 కి 100 శాతం థియేటర్లు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఊళ్లల్లో అన్ని సింగిల్ స్క్రీన్స్ జనవరి 12న గుంటూరు కారం సినిమాకే కేటాయిస్తున్నారు.
Also Read : Hanuman : ‘హనుమాన్’ కి ఇన్ని ఇబ్బందులా? ఎవరూ సపోర్ట్ చేయట్లేదా? థియేటర్స్ కూడా దొరకట్లేదా?
గుంటూరు కారం కేవలం తెలుగు రిలీజ్ కావడంతో తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ జనవరి 12 అన్ని థియేటర్స్ బాబుకే వెళ్లనున్నాయి. అయితే హనుమాన్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ ఉండటంతో ఆ 10 శాతం థియేటర్స్ దానికి కేటాయిస్తారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే బాబు గట్టిగానే ఓపెనింగ్స్ కొడతాడు. మహేష్ బాబు గత సినిమా సర్కారు వారు పాట ఎలాంటి పండగ లేనప్పుడే, సమ్మర్ సీజన్ లో వచ్చి ఓపెనింగ్ రోజు 75 కోట్ల గ్రాస్ సాధించింది. ఇప్పుడు గుంటూరు కారం సంక్రాంతి పండగకి వచ్చి, ఇన్ని థియేటర్స్ దొరుకుతుంటే ఓపెనింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఇక హిట్ టాక్ వస్తే ఆ తర్వాత వచ్చే సినిమాలకు కొన్ని థియేటర్స్ మాత్రమే వెళ్తాయి.