ఆర్య కాంబినేషన్ రిపీట్: బన్నీతో సుకుమార్

  • Publish Date - March 4, 2019 / 11:40 AM IST

సుకుమార్ అల్లూ అర్జున్ కాంబినేషన్ అనగానే టక్కున గుర్తొచ్చే సినిమా ఆర్య. విభిన్న కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా అల్లూ అర్జున్ కెరియర్ లో మైలురాయిగా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఫస్ట్ సినిమా కూడా ఇదే. ఫీల్ మై లవ్ అంటూ 2004లో వచ్చిన ఆర్యకు బ్రహ్మరథం పట్టడంతో  తర్వాత ఆర్య-2 సినిమాను వీరరిద్దరు తీసినప్పటికీ అది పెద్దగా ఆకట్టుకోలేదు.

అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి సినిమా రాబోతుంది.  పదేళ్ల తరువాత బన్నీ- సుకుమార్ కాంబినేషన్ రిపీట్ కానుండగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. మహాశివరాత్రి సందర్భంగా మైత్రీ మూవీస్ మేకర్స్‌ సుకుమార్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా గురించి అఫీషియల్‌గా ప్రకటించారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 19వ మూవీ చేస్తున్న అల్లూ అర్జున్.. 20వ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సుకుమార్.. ఆ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అలాగే అల్లూ అర్జున్ కూడా ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.