Sukumar swag Rap Song video goes viral
Sukumar : కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఇక పుష్ప సినిమాతో ఆయన స్థాయి మరింత పెరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా కలెక్షన్ ల సునామి సృష్టిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో కాసుల వర్షం కురిపిస్తుంది.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ పై అమితాబ్ బచ్చన్ ప్రశంశలు.. బన్నీ ఏం చెప్పాడంటే…
అయితే తాజాగా సుకుమార్ పై ఓ రాప్ సాంగ్ చేశారు. అద్విత్ రెడ్డి ఈ సాంగ్ ను సుకుమార్ కి ప్రెసెంట్ చేశారు. ఆయన దర్శకత్వం, ప్రతిభను అలాగే ఆయన గొప్పతనాన్ని చూపిస్తూ.. వీడియో రూపంలో ఒక రాప్ సాంగ్ రిలీజ్ చేశారు. పుష్ప సినిమాకు సంబంధించిన లొకేషన్స్ మూమెంట్స్ ని చూపిస్తూ.. ఆయన కంటెంట్ బలాన్ని హైలైట్ చేస్తూ ఈ సాంగ్ లో ఆయన కష్టాన్ని చూపించారు. అలాగే సుకుమార్ సార్ మీరు ఒక మాన్ స్టర్ అంటూ రాసుకున్న లైన్స్ కూడా చాలా పవర్ఫుల్ గా చూపించారు.
పుష్ప కోసం ఆయన ఎంత కష్టపడ్డారో.. వీడియోలో హైలెట్ చేసి చూపించారు. కాగా ఈ సాంగ్ ను అద్విత్ రెడ్డి ప్రెసెంట్ చెయ్యగా.. పవన్ మ్యూజిక్ అందించారు. చరణ్ ఈ పాటను ఆలపించారు. సుక్కుకి డేడికేట్ చేస్తూ ప్రెసెంట్ చేసిన ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. మీరు కూడా సాంగ్ వినేయ్యండి..