Allu Arjun : అల్లు అర్జున్ పై అమితాబ్ బచ్చన్ ప్రశంశలు.. బన్నీ ఏం చెప్పాడంటే…

అయితే తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

Allu Arjun : అల్లు అర్జున్ పై అమితాబ్ బచ్చన్ ప్రశంశలు.. బన్నీ ఏం చెప్పాడంటే…

Amitabh Bachchan speeches on Allu Arjun

Updated On : December 9, 2024 / 12:32 PM IST

Allu Arjun : ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 మేనియా నడుస్తుంది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే 600కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనాన్ని సృష్టిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ తిరగరాస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతుంది పుష్ప 2. పుష్ప 2 ఇంతటి విజయాన్ని అందుకోవడంతో చాలా మంది సినీ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

Also Read : Pushpa 2 : నార్త్ అమెరికాలో బన్నీ జోరు.. ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసిన పుష్ప 2

అయితే తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ కి మిమ్మల్ని ఎక్కువ ఇన్ స్పైర్ చేసిన యాక్టర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. దానికి బన్నీ.. అమితాబ్ అని సమాధానమిచ్చాడు. ఆయన సినిమాలు చూసి పెరిగాను అందుకే ఆయనంటే ఎంతో ఇష్టం అని అన్నాడు. దాంతో ఆ వీడియో వైరల్ గా మారడంతో స్పందించాడు అమితాబ్.

ఆయన సోషల్ మీడియా వేదికగా.. “అల్లు అర్జున్ గారు.. మీ మాటలు నా మనసుకు చేరాయి.. మీరు నా అర్హతకి మించి నన్ను పొగిడేస్తున్నారు.. మేమందరం మీ పనితనం, మీ టాలెంట్‌కు పెద్ద ఫ్యాన్స్.. ఇకపై మీరు మమ్మల్ని ఇంకా ఇన్ స్పైర్ చేస్తూనే ఉండాలి.. మీరు ఇలానే విజయాలు సాధిస్తూ ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను అని ట్వీట్ వేశారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో బన్నీ సైతం దీనికి రిప్లై ఇచ్చాడు.

అమితాబ్ గారు.. మీరు మా సూపర్ హీరో.. మీరు నా గురించి ఇలా మాట్లాడడం ఆనందంగా ఉంది.. మీరు మనస్పూర్తిగా ఇచ్చిన ఈ కాంప్లిమెంట్స్‌కు నేను ఎప్పటికీ థ్యాంక్ ఫుల్ గా ఉంటాను.. అని బన్నీ రిప్లై ఇచ్చాడు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ నెట్టింటి వైరల్ అవుతుంది.