Pushpa 2 : నార్త్ అమెరికాలో బన్నీ జోరు.. ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసిన పుష్ప 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా వైల్డ్ ఫైర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

Allu Arjun Pushpa 2 movie broke the record of Interstellar movie
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా వైల్డ్ ఫైర్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తో పాటు మరికొందరు కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.
అయితే పుష్ప 2 సినిమా కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంటుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుంది. తాజాగా నార్త్ అమెరికాలో సంచలం సృష్టించిన ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమా రికార్డు కూడా బ్రేక్ చేసింది పుష్ప 2. సినీ ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకున్న ఈ సినిమా క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో 2014లో తెరకెక్కింది. ఈ సినిమా వచ్చి దాదాపుగా 10 ఏళ్ళు అవుతుంది అయినప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం అలానే ఉంది.
పుష్ప 2 సినిమా ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమా కలెక్షన్స్ బీట్ చేసింది. ఇటీవల ఈ సినిమాను 165 థియేటర్స్ లో రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో ఇంటర్ స్టెల్లార్ శనివారం ఒక్క రోజులో 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టగా.. పుష్ప 2 మాత్రం 1.7 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఇంటర్ స్టెల్లార్ రాబట్టిన 1.3 డాలర్లను బీట్ చేస్తూ పుష్ప 2 దానికంటే ఎక్కువ వసూలు చేసింది. అలా హాలీవుడ్ సినిమాల రికార్డ్స్ కూడా తిరగరాస్తుంది పుష్ప 2. ఇటీవల ఈ సినిమా రీ రిలీజ్ కి థియేటర్స్ ఇవ్వకపోతే పుష్ప 2 పై మండిపడ్డారు అక్కడి జనం. అలాంటిది ఇప్పుడు ఆ సినిమా రికార్డునే తిరగరాసింది పుష్ప 2.