×
Ad

Suma Kanakala : రిటైర్మెంట్ పై సుమ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్..

ఇలాంటి వాటన్నిటికీ తాజాగా సుమ కౌంటర్ ఇచ్చింది. (Suma Kanakala)

Suma Kanakala

Suma Kanakala : యాంకర్ సుమ తన మాటలతో టీవీ షోలలో, సినిమా ఈవెంట్స్ లో అందర్నీ కట్టిపడేసి మెప్పిస్తుంది. తెలుగు వారి ఇళ్లల్లో ఒకరిగా మారిపోయింది సుమ కనకాల. దాదాపు 30 ఏళ్లకు పైగా టీవీ, సినిమా రంగంలో ఉంది సుమ. దాదాపు 20 ఏళ్లకు పైగా యాంకరింగ్ తో అందర్నీ అలరిస్తుంది. ప్రస్తుతం సుమకు 50 ఏళ్ళు. అయినా చాలా యంగ్ గా కనిపిస్తూ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది.(Suma Kanakala)

అయితే ఇటీవల కొంతమంది సుమకు ఏజ్ అయిపోతుంది, సుమ తర్వాత ఎవరు, సుమ ఎప్పుడు రిటైర్ అవుతుంది అని పలు కామెంట్స్ చేసారు. కొంతమంది యాంకర్స్ కూడా ఇండైరెక్ట్ గా సుమనే అన్ని కవర్ చేస్తుంది, తమకు ఏమి రావట్లేదు అని పలు సందర్భాలలో అన్నారు. ఇలాంటి వాటన్నిటికీ తాజాగా సుమ కౌంటర్ ఇచ్చింది. సుమ ప్రేమంటే సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా నవంబర్ 21న రిలీజ్ కానుంది.

Also Read : Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ కనకాల మాట్లాడుతూ.. మా అమ్మకు 84 ఏళ్ళు. కానీ వెరీ యంగ్. ఆమెకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరెప్పుడు రిటైర్ అవుతారు అని. నేనెందుకు రిటైర్ అవ్వాలి. మా ఫ్యామిలీలో జెనెటిక్స్ లో చాలా స్ట్రాంగ్ జీన్స్. మా అమ్మమ్మ 101 ఏళ్ళు బతికింది. మా పెద్ద మామయ్యకు 99 ఏళ్ళు. ఇప్పటికి అడ్వకెట్ గా పనిచేస్తున్నారు. గిన్నిస్ రికార్డ్ హోల్డర్. నన్ను ఎందుకు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి. నేను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఇలానే వర్క్ చేస్తూ ఉంటాను. స్టేజిపైకి నేను వచ్చాక మీ అరుపుల్లో, సుమ అక్క అని మీరు అరిచే అరుపుల్లో ప్రేమ ఉంది. అవి చూసి అయినా నేను ఇప్పట్లో రిటైర్ అవ్వను అని తెలిపింది.

దీంతో సుమ రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించకూడదు అని క్లారిటీ వచ్చేసింది. తన రిటైర్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళకు సుమ ఈ రకంగా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సుమ తన హెల్త్ ని జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి ఇంకో 10 ఏళ్ళ పైనే యాంకరింగ్ ఇలాగే చేసినా ఆశర్యపోనవసరం లేదు.

Also Read : Ram Pothineni : అబ్బా ఏమున్నాడ్రా బాబు.. చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని.. లేటెస్ట్ ఫొటోలు..