Suman Tej hebah Patel Sandeham Movie getting Good Response in ETV Win OTT
Sandeham : సుమన్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ‘సందేహం’. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా నిర్మాణంలో సతీష్ పరమవేద దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సుమన్ తేజ్ డ్యూయల్ రోల్ చెయ్యగా బిగ్ బాస్ శ్వేతా వర్మ, రాశిక శెట్టి, బిగ్ బాస్ శుభ శ్రీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
సందేహం సినిమా కరోనా లాకా డౌన్ సమయంలో భార్యాభర్తలు, ఓ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మధ్య జరిగిన కథాంశంతో రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కించారు. థియేటర్స్ లో పర్లేదనిపించిన ఈ సినిమా ఇటీవలే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. వరుసగా మంచి మంచి కంటెంట్స్ ని తీసుకొస్తున్న ఈటీవీ విన్ ఓటీటీ ఈ సందేహం సినిమాను కూడా తీసుకుంది.
Also Read : Nidhhi Agerwal : ‘సీజ్ ది షిప్’.. హరిహర వీరమల్లు పై నిధి అగర్వాల్ అదిరిపోయే పోస్ట్..
ఓటీటీలో సందేహం సినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. మంచి థ్రిల్లింగ్ మూవీ చూడాలనుకుంటే మీరు కూడా సందేహం సినిమాను ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయండి.