Site icon 10TV Telugu

Mem Famous : ఓటీటీలోకి వచ్చేసిన ‘మేమ్ ఫేమస్’.. ఎందులో? ఎప్పటినుంచి?

Sumanth Prabhas Mem Famous movie streaming in Amazon Prime

Sumanth Prabhas Mem Famous movie streaming in Amazon Prime

Sumanth Prabhas :  యూట్యూబర్ సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన సినిమా మేము ఫేమస్. ఛాయ్ బిస్కెట్ నిర్మాతలు ఈ సినిమాని తెరకెక్కించారు. మే 26న ఈ సినిమాని రిలీజ్ చేశారు. చిన్న సినిమా అయినా భారీ ప్రమోషన్స్ చేశారు. టాలీవుడ్ లో అనేకమంది సెలబ్రిటీలు వచ్చి మేము ఫేమస్ సినిమా కోసం ప్రమోషన్స్ చేశారు. సినిమా రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే సినిమా నచ్చిందని అభినందిస్తూ ట్వీట్ చేయడమే కాక సుమంత్ ప్రభాస్ కి తన నిర్మాణ సంస్థలో సినిమా అవకాశం ఇచ్చారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇక రాజమౌళి కూడా ఈ టీంని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. తెలంగాణలోని ఓ పల్లెటూళ్ళో ఖాళీగా అండ్ నలుగురు కుర్రాళ్ళు మారి ఎలా సక్సెస్ అయ్యారు అనే మాములు కథాంశమే అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ, ఎమోషన్స్ తో తెరకెక్కించారు.

Dil Raju son : దిల్‌రాజు తనయుడి మొదటి పుట్టిన రోజు వేడుకల్లో సెలబ్రిటీలు..

మేము ఫేమస్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. నేడు జూన్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ లో మేమ్ ఫేమస్ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో యూత్ థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోయారు. ఈ సినిమా ద్వారా దాదాపు 30 మంది మొదటిసారి సినిమాలో నటించి వెండితెరపై కనపడ్డారు. ఈ సినిమాతో అందులో చాలామందికి మంచి గుర్తింపు వచ్చింది.

Exit mobile version