ఆసక్తి రేపుతున్న సుమంత్ ‘కపటధారి’ టీజర్!

  • Published By: sekhar ,Published On : October 29, 2020 / 06:36 PM IST
ఆసక్తి రేపుతున్న సుమంత్ ‘కపటధారి’ టీజర్!

Updated On : October 29, 2020 / 6:41 PM IST

Kapatadhaari Teaser: ‘మళ్ళీ రావా.. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్‌’ సినిమాలతో వరుస విజయాలందుకున్న యంగ్ హీరో సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘కపటధారి’’.. గతేడాది కన్నడలో సూపర్ హిట్ అయిన ‘‘కావలుధారి’’ (Kavaludaari) చిత్రానికిది రీమేక్.. విజయ్ ఆంటోని ‘భేతాళుడు’ మూవీతో ఆకట్టుకున్న ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేస్తున్నాడు. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. శ్వేత నందిత (నందిత శ్వేత) కథానాయిక.


గురువారం ఈ సినిమా టీజర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. టీజర్‌ చూస్తుంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక బలమైన కారణం ఉందనే పాయింట్‌ను బేస్‌ చేసుకుని కథను రూపొందించినట్లు కనిపిస్తుంది. అలాగే ఏదో హత్య కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే పోలీసులతో ట్రాఫిక్‌ పోలీస్‌ అయిన సుమంత్‌ జాయిన్‌ అవుతానని అడగటం, చివరకు కేసును ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న పోలీసులు కేసులో ఇన్‌వాల్వ్‌ కావద్దని సుమంత్‌కు వార్నింగ్‌ ఇచ్చే సన్నివేశాలు ఎగ్జైట్‌మెంట్‌ను పెంచుతున్నాయి.


టీజర్‌ చివరలో వినిపించే ‘వాడి అసలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి’ అంటూ హీరోను ఉద్దేశించి చెబుతున్న డైలాగ్‌తో పాటు టీజర్‌ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తున్న సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు, సైమన్ కె కింగ్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది.