Sumaya Reddy Pruthvi Ambaar Dear Uma Teaser released
Dear Uma Teaser : తెలుగు సినిమాలు, హీరోలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతున్నా.. తెలుగు నుంచి హీరోయిన్స్ మాత్రం రావడం లేదు. ఇతర పరిశ్రమకు చెందిన అమ్మాయిలే టాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ‘బేబీ’ మూవీతో టాలీవుడ్ లో ఒక చిన్న మార్పు వచ్చింది. చిన్న సినిమాల్లో తెలుగు అమ్మాయిలు కథానాయికలుగా కనిపించడం మొదలయింది.
అయితే తాజాగా ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్ గా మాత్రమే కాదు నిర్మాతగా, కథ రచయితగా కూడా ఆడియన్స్ ని పలకరించబోతుంది. ‘సుమయ రెడ్డి’ అనే తెలుగు అమ్మాయి తన బహు ముఖ ప్రజ్ఞతో అందరినీ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై ‘డియర్ ఉమ’ అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. సాయి రాజేష్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
Also read : Tillu Square Trailer : యూత్ ఫెస్టివల్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేసింది..
సూపర్ హిట్ లవబుల్ మూవీ ‘దియా’ యాక్టర్ పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నారు. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. ఇక ఈ టీజర్ లో ‘అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉండదు.. అమ్మాయిల స్వార్థంలోనే ప్రేమ ఉంటుంది’ అనే డైలాగ్స్ లవర్స్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమ ఇచ్చే సంతోషాన్ని, బాధను ఓ దృశ్యకావ్యంగా ఈ సినిమాతో చూపించబోతున్నారని తెలుస్తుంది.
ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు. కాగా ఈ సినిమాకి రధన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కమల్ కామరాజు, సప్త గిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూప లక్ష్మీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.