Tillu Square Trailer : యూత్ ఫెస్టివల్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేసింది..
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యూత్ ఫెస్టివల్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేసింది.

Anupama Parameswaran Siddu Jonnalagadda Tillu Square trailer released
Tillu Square Trailer : టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ నటించిన సూపర్ హిట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘డీజే టిల్లు’. రాధిక రాధిక అంటూ థియేటర్స్ లో టిల్లు చేసిన రచ్చని యూత్ తెగ ఎంజాయ్ చేశారు. ఇక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. మేకర్స్ సీక్వెల్ ని ప్రకటించి ‘టిల్లు స్క్వేర్’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. మొదటి భాగానికి కథని, డైలాగ్స్ ని అందించిన హీరో సిద్దునే.. ఈ సీక్వెల్ కి కూడా కథని, డైలాగ్స్ ని రాస్తున్నారు.
మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ టిల్లుకి జోడిగా నటిస్తున్నారు. ఇక ఆల్రెడీ ఈ మూవీ నుంచి టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ లో మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. తాజాగా నేడు ప్రేమికుల రోజు దినోత్సవం సందర్భంగా ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మరి ఆ ఎంటర్టైనింగ్ ట్రైలర్ వైపు మీరు ఓ లుక్ వేసేయండి.
Also read : Shah Rukh Khan : ఖతార్ నుండి భారత నేవీ అధికారుల విడుదల విషయంలో నా ప్రమేయం లేదు..
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 29న రిలీజ్ కాబోతుంది. దీంతో థియేటర్ లో మరోసారి యూత్ ఫెస్టివల్ ని జరుపుకునేందుకు యూత్ అంతా సిద్దమవుతుంది. రామ్ మిరియాల ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.