ఈ సమ్మర్ ఫుల్ ప్యాక్ – పదికి పైగా సినిమాలు!
2020 వేసవిలో దాదాపు పదికి పైగా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి..
2020 వేసవిలో దాదాపు పదికి పైగా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి..
తెలుగు సినిమాకి సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి మంచి సీజన్.. ఈ సీజన్లో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు భారీ స్థాయిలో విడుదలవుతుంటాయి. ఈ ఏడాది సంక్రాంతి ముగిసింది. ఇక సమ్మర్‌కి రంగం సిద్ధమౌతుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్ ఇండియా’తో సమ్మర్ సినిమాల సందడి స్టార్ట్ కానుంది. మార్చి 6న ఈ చిత్రం విడుదల చేయనున్నారు.
ఇక ఉగాది కానుకగా నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు నటించిన థ్రిల్లర్ ‘వి’ మార్చి 25న రిలీజ్ అవనుంది. శర్వానంద్ ‘శ్రీకారం’, మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ‘ఉప్పెన’ కూడా ఏప్రిల్ 2నే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
Read Also : మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో లో సూపర్ స్టార్ రజనీకాంత్!
మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘రెడ్’ చిత్రం కూడా సమ్మర్లో సందడి చేసేందుకు ఏప్రిల్ 9న రానుంది. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య-శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ ఏప్రిల్ 17న విడుదల కానుండగా, సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఏప్రిల్ 24న విడుదల కానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రీసెంట్గా సెట్స్ పైకి వెళ్ళిన వెంకటేష్ ‘నారప్ప’తో పాటు అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం కూడా మే 1న రిలీజ్ కానున్నట్టు సమాచారం.
రవితేజ ‘క్రాక్’ మే 8న, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ మే 23న, కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రాలు మేలో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ లెక్కన సమ్మర్లో బాక్సాఫీస్ వద్ద సందడి మాములుగా ఉండేలా లేదు మరి.