Sundeep Kishan comments on relationship and his breakup
Sundeep Kishan : యువ హీరో సుందీప్ కిషన్ ఇటీవలే మైఖేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సందీప్ గత సినిమాలు పరాజయం పాలవడంతో ఈ సినిమాపైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించడం, పాన్ ఇండియా రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు సందీప్. అయితే ఈ సినిమా టేకింగ్ విషయంలో విమర్శకులని మెప్పించిన ఆడియన్స్ కి మాత్రం అంతగా కనెక్ట్ అవ్వలేదు. కమర్షియల్ సక్సెస్ అయ్యేలా లేదు.
Parineeti Chopra : India UK Achievers అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నటి..
తాజాగా సినిమా రిలీజ్ తర్వాత చేసిన ప్రమోషన్స్ లో ప్రేమ, పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు అడగగా సందీప్ కిషన్ దానికి సమాధానమిస్తూ.. ప్రస్తుతానికి అయితే నేను ఎవరితో రిలేషన్ షిప్ లో లేను. అసలు అది నాకు సెట్ అవ్వదు. నేను నా పార్ట్నర్ ఉంటే, తనపై ఎక్కువగా ఆధారపడతాను, తనతో అన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటాను, తనతో సమయం కేటాయించాలని అనుకుంటాను, నేను వాళ్ళని అంత ఈజీగా వదులుకోలేను. వాళ్ళు కూడా అలాగే ఉండాలనుకుంటాను, కానీ వాళ్ళు ఉండరు. అందుకే నా లాంటి వ్యక్తికి రిలేషన్ షిప్ అస్సలు సూట్ అవ్వదు. అందరిలాగే నేను కూడా గతంలో బ్రేకప్ దెబ్బ చూశాను. ప్రస్తుతానికి అయితే ఎవ్వరితో ప్రేమలో లేను, సమయం వస్తే చెప్పలేను అని అన్నాడు.