Sundeep Kishan Gifted a Costly Car to Her Mother for Birthday
Sundeep Kishan : హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ఊరిపేరు భైరవకోన, రాయన్ సినిమాలతో హిట్స్ కొట్టగా త్వరలో మజాకా సినిమాతో రాబోతున్నాడు. ఓ వైపు సినిమాలతో మరో వైపు బిజినెస్ లతో బిజీగా ఉన్నాడు సందీప్ కిషన్. తాజాగా సందీప్ కిషన్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
సందీప్ కిషన్ తన తల్లితండ్రులు, కొత్త కార్ తో దిగిన ఫోటోలు షేర్ చేసి.. మా అమ్మకు పుట్టిన రోజు గిఫ్ట్. ఇప్పటికి మా అమ్మ ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేయడానికి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ రోజూ వెళ్తుంది. ఒక కొడుకుగా నన్ను మా అమ్మ ఒక కార్ కొనిమ్మని మాత్రమే అడిగింది. ఈ చిన్న గోల్స్ పెద్ద సంతోషాన్నిస్తాయి అంటూ పోస్ట్ చేసాడు. దీంతో సందీప్ కిషన్ తన తల్లికి బర్త్ డేకు కార్ గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తుంది.
సందీప్ కిషన్ వాళ్ళ అమ్మకు రేంజ్ రోవర్ కారు కొనిచ్చాడు. ఈ కార్ ధర ఆల్మోస్ట్ 80 లక్షలు ఉంటుందని సమాచారం. దీంతో సందీప్ కిషన్ ను ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.