Site icon 10TV Telugu

Mazaka : ఓటీటీలో దూసుకుపోతున్న మజాకా.. అప్పుడే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌..

Sundeep Kishan Mazaka Movie Creates History in Zee 5 OTT

Sundeep Kishan Mazaka Movie Creates History in Zee 5 OTT

Mazaka : సందీప్ కిషన్, రీతువర్మ జంటగా తెరకెక్కిన ‘మజాకా’ సినిమా ఇటీవల ఫిబ్రవరి 26 న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాతో మన్మధుడు ఫేమ్ అన్షు అంబానీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మజాకా సినిమా థియేటర్స్ లో నవ్వించి ఇటీవల మార్చ్ 28 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

తాజాగా జీ5లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మజాకా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది. మజాకా ప్రస్తుతం ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో కామెడీ, రొమాన్స్, తండ్రీకొడుకుల సెంటిమెంట్, అత్తాకోడళ్ల సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలతో తెరకెక్కించిన మజాకా ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది.

Also Read : NTR – Adhurs : అందుకే అదుర్స్ 2 చెయ్యట్లేదు.. అదుర్స్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..

ఈ సందర్భంగా జీ5లో SVOD సౌత్ వైస్ ప్రెసిడెంట్ లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ.. ప్రాంతీయ సినిమాల్లో ప్రస్తుతం మజాకా జీ5లో ట్రెండ్ అవుతోంది. మజాకా విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. రావు రమేష్, సందీప్ కిషన్‌ కాంబో అందరినీ ఆకట్టుకుంది. ఈ విజయం మా ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ను అందించే జీ5 నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది అని అన్నారు.

నటుడు రావు రమేష్ మాట్లాడుతూ.. మజాకాకు వచ్చిన అద్భుత స్పందన చూసి నేను నిజంగా థ్రిల్ అయ్యాను. జనాలు జీ5 లో ఇంత ఆదరించడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇంత మంచి పాత్ర ఇచ్చిన వారికి ఎప్పుడూ నేను కృతజ్ఞుడినే అని అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మజాకాకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి సంతోషంగా ఉంది. పక్కింటి అబ్బాయిలా ఉండే కృష్ణ పాత్రను పోషించడం సవాల్‌గా అనిపించినా అలాంటి పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అని అన్నారు.

Exit mobile version