NTR – Adhurs : అందుకే అదుర్స్ 2 చెయ్యట్లేదు.. అదుర్స్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..

ఈ ఈవెంట్లో అదుర్స్ సీక్వెల్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ..

NTR – Adhurs : అందుకే అదుర్స్ 2 చెయ్యట్లేదు.. అదుర్స్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..

NTR Comments on Adhurs Sequel Movie in Mad Square Success Event goes Viral

Updated On : April 4, 2025 / 9:40 PM IST

NTR – Adhurs : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు.. పలువురు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇటీవల మార్చ్ 28న రిలీజయి పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా నేడు ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు.

ఈ ఈవెంట్లో అదుర్స్ సీక్వెల్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. కామెడీ పండించడం కష్టం ఒక యాక్టర్ కి. అందుకే నేను అదుర్స్ 2 చెయ్యట్లేదు. భయపడుతున్నాను. అంత కామెడీ వస్తుందో లేదో తెలీదు అని అన్నారు. దీంతో ఎన్టీఆర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : NTR Speech : అతను లేకపోతే సినిమా లేదు.. నా బామ్మర్దిని చూసి గర్వపడుతున్నాను.. నేను సపోర్ట్ చేయను అని చెప్పా..

వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో వచ్చిన అదుర్స్ సినిమా అప్పట్లో ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించి పెద్ద హిట్ అయింది. ఎన్టీఆర్ ఫుల్ గా కామెడీ చేసింది ఆ సినిమాలోనే. ఇటీవల ఆ సినిమా రీ రిలీజ్ కూడా చేసారు. ఎన్టీఆర్ మళ్ళీ అలాంటి కామెడీ రోల్ చేయాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదుర్స్ సీక్వెల్ కూడా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ ఇలా మాట్లాడటంతో అదుర్స్ 2 ఉండదని క్లారిటీ వచ్చేసింది.