NTR Speech : అతను లేకపోతే సినిమా లేదు.. నా బామ్మర్దిని చూసి గర్వపడుతున్నాను.. నేను సపోర్ట్ చేయను అని చెప్పా..

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు.

NTR Speech : అతను లేకపోతే సినిమా లేదు.. నా బామ్మర్దిని చూసి గర్వపడుతున్నాను.. నేను సపోర్ట్ చేయను అని చెప్పా..

NTR Interesting Speech in Mad Square Success Meet

Updated On : April 4, 2025 / 9:24 PM IST

NTR Speech : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు.. పలువురు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇటీవల మార్చ్ 28న రిలీజయి పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా నేడు ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు.

ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చాలా కాలం అయిపోయింది మీతో మాట్లాడి, మన అందరం కలుసుకొని. ఇవాళ వంశీ వల్లే మన అందరం ఇక్కడ కలుసుకున్నాం. నవ్వించడం ఒక వరం. మనకి ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా ఒక మనిషి వచ్చి నవ్విస్తే బాగుంటుంది. అలా నవ్విచ్చే మనుషులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఒక సినిమా హిట్ అయ్యాక దాని సీక్వెల్ తో అందర్నీ మెప్పించడం చాలా కష్టం. కానీ నువ్వు అది సాధించావు. ఒక దర్శకుడికి ఉండాల్సింది ప్యూర్ సోల్ తో కథ రాయడం. మీరు అది చేసి సక్సెస్ అయ్యారు. ఈ దర్శకుడికి అండగా ఉండి, ఈ సినిమాలో పని చేసిన అందరికి కంగ్రాట్స్.

Also Read : Narne Nithiin – NTR : బావ గారి ముందు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను.. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ స్పీచ్ వైరల్..

ఈ సినిమాలో ఫాదర్ రోల్ చేసిన మురళీధర గౌడ్ అద్భుతంగా నటించారు. సినిమాలో యాంటోని ఎంట్రీ ఇచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టాను. ఫస్ట్ పార్ట్ లో బాగా నవ్వించారు. లడ్డు పాత్రలో చేసిన విష్ణు గారు లేకపోతే ఈ సినిమా లేదు. విష్ణు అంత ఇన్నోసెంట్ గా లేకపోతే ఈ సినిమా హిట్ అయ్యేది కాదు. సంగీత్ ని, వాళ్ళ అన్నయ్యని చూస్తే వాళ్ళ నాన్న శోభన్ గారు గుర్తొస్తారు. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు దూరం అయితే మనతోనే ఉంటారు. నాన్న గారు ఇక్కడే ఉండి నీ సక్సెస్ చూస్తారు. రామ్ నితిన్ ని చూస్తే నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడినో అలాగే ఉన్నాడు.

2011లో నాకు పెళ్లయింది. అప్పుడు నితిన్ చాలా చిన్న పిల్లాడు. అప్పట్లో నాతో మాట్లాడేవాడు కాదు. నేను ట్రై చేశాను కానీ మాట్లాడేవాడు. వాడు మొదటిసారి ధైర్యంగా వచ్చి నాతో మాట్లాడింది బావా నేను యాక్టర్ అవుతా అన్నాడు. నేను అలాగే కానీ నా సపోర్ట్ నీకు ఉండదు, నీ ఇష్టం అన్నాను కానీ నాకు ఎలా ఉంటాడో అని భయపడ్డాను. నాకు ఏం చెప్పకు, నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పాను. తను నన్ను ఏది అడగలేదు. ఇవాళ తనని చూస్తే నాకు గర్వంగా ఉంది. అతను పనిచేసిన దర్శకులు, నిర్మాతల వల్లే సక్సెస్ అయ్యాడు. ఇంటికెళ్ళాక మళ్ళీ మాట్లాడతా నీతో.

Also Read : Devara : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చని మళ్ళీ గుర్తుచేసి.. ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పి.. ఆ వీడియోలు ప్లే చేసి.. మ్యాడ్ ఈవెంట్లో..

సత్యం రాజేష్ బాగా నవ్వించాడు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ గారు, ధర్మవరపు గారి తర్వాత నాకు నచ్చిన కమెడియన్ సునీల్. చాలా కాలం తర్వాత సునీల్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. సునీల్ వేరే పాత్రలు చేసినా నవ్వించడం మానొద్దు. నాగవంశీ మా చింటూ మాట కరుకుగా ఉన్నా మంచితనంగా ఉంటాడు. వీళ్ళ అందరి వెనకాల అతను ఉన్నాడు. వంశీతో నేను సినిమా చేయబోతున్నాను. దేవర సినిమాని హిట్ చేసి మీ భుజాలపై మోసుకున్నందుకు థ్యాంక్యూ. దేవర 2 ఖచ్చితంగా ఉంటుంది. జన్మనిచ్చినందుకు నాన్నకు థ్యాంక్యూ. ఈ జన్మ వీళ్ళకే అంకితం. మీ కోసమే కష్టపడతాను. కాలర్ ఎత్తుకునేలానే కష్టపడతాను అని అన్నారు.

ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ముందుకి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడటంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది.