Devara : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చని మళ్ళీ గుర్తుచేసి.. ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పి.. ఆ వీడియోలు ప్లే చేసి.. మ్యాడ్ ఈవెంట్లో..

నేడు మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ నిత్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారు.

Devara : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చని మళ్ళీ గుర్తుచేసి.. ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పి.. ఆ వీడియోలు ప్లే చేసి.. మ్యాడ్ ఈవెంట్లో..

NTR Devara Pre Release Event Issues Talk in Mad Square Event

Updated On : April 4, 2025 / 8:09 PM IST

Devara Pre Release Event : ఎన్టీఆర్ దేవర సినిమాకు ప్రమోషన్స్ ఎక్కువగా చేయలేదని తెలిసిందే. అయితే ఫ్యాన్స్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిద్దాం అనుకున్నారు. హైదరాబాద్ నోవాటెల్ లో ఏర్పాట్లు చేసారు. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా పాస్ లు, పర్మిషన్లు లేకపోయినా ఫ్యాన్స్ రావడంతో ఆ హోటల్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతమంది ఫ్యాన్స్ హోటల్ అద్దాలు పగలగొట్టి, ఈవెంట్ వద్ద రచ్చ రచ్చ చేసి హంగామా చేసారు. దాంతో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసారు.

అయితే ఈవెంట్ ఆర్గనైజర్లు శ్రేయాస్ శ్రీనివాస్ సరిగ్గా నిర్వహించలేదని అతనిపై, ఈవెంట్ కంపెనీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసారు. అప్పుడే ఆ ఈవెంట్ కంపెనీ వాళ్ళు క్షమాపణలు చెప్పారు. తర్వాత సక్సెస్ ఈవెంట్ చేస్తామన్నారు. కానీ సక్సెస్ ఈవెంట్ కూడా చేయలేదు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పటికి శ్రేయాస్ ఈవెంట్ కంపెనీపై కోపంగానే ఉన్నారు.

Also Read : NTR Vs Rajinikanth : ఎన్టీఆర్ వర్సెస్ రజినీకాంత్.. ఇండిపెండెన్స్ డే కి వార్ మాములుగా లేదు.. వెయ్యి కోట్లు ఎవరు కొడతారో..?

అయితే నేడు మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ నిత్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. అయితే ఈ వేదికపై శ్రేయాస్ ఈవెంట్ కంపెనీ మరోసారి దేవర ఈవెంట్ క్యాన్సిల్ ని గుర్తుచేసింది.

యాంకర్ సుమ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన దేవర ఈవెంట్ అనుకోకుండా రద్దయింది. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట కర్నూల్ లో చేద్దామనుకున్నారు. పర్మిషన్స్ రాకపోవడంతో ఖమ్మంలో చేద్దామనుకున్నారు. వాతావరణ పరిస్థితులు బాగోకపోవడంతో హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో చేద్దామనుకున్నారు కానీ పర్మిషన్స్ రాకపోవడంతో నోవాటెల్ లో నిర్వహించారు. అక్కడ 6000 మందికి పర్మిషన్ ఇవ్వగా వేలమంది అభిమానులు రావడంతో అనుకోకుండా ఈవెంట్ క్యాన్సిల్ అయింది అందుకు శ్రేయాస్ శ్రీనివాస్ ఆల్రెడీ క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు మరోసారి చెప్తున్నారు అని తెలిపింది.

Also Read : Chirutha : వాట్.. చిరుత రామ్ చరణ్ చేయాల్సింది కాదా? వేరే హీరో, డైరెక్టర్ తో షూట్ చేసి.. ఇప్పుడు ఆ హీరో ఫ్లాప్స్ తో..

ఆ ఈవెంట్ కి సంబంధించి శ్రేయాస్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఓ 1000 మందితో ముందు రోజు నుంచే ఈవెంట్ పనులు భారీగా ఎలా చేశారు, అక్కడ ఫ్యాన్స్ వచ్చాక ఏం జరిగింది అని ఒక వీడియో ప్లే చేసి చూపించి మరోసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాణాలు చెప్పారు. దీంతో ఈ వీడియో, సుమ మాటలు వైరల్ గా మారాయి. అయితే ఆల్రెడీ మర్చిపోయిన దాన్ని ఆ ఈవెంట్ కంపెనీ వాళ్ళు తమకు జరిగిన డ్యామేజీ తగ్గించుకోడానికే మళ్ళీ దేవర ఈవెంట్ ఇష్యూని బయటకి తీసి మాట్లాడారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.