Sundeep Kishan Ritu Varma Mazaka Trailer Released
Mazaka Trailer : సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్నాడు. ఊరుపేరు భైరవకోన, రాయన్ సినిమాల హిట్స్ తర్వాత ఇప్పుడు మజాకా సినిమాతో రాబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మాణంలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మజాకా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి స్టార్ రైటర్ ప్రసన్న బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.
Also Read : Vishwambhara : వామ్మో.. చిరంజీవి ‘విశ్వంభర’ హిందీ రైట్స్ అన్ని కోట్లకు అమ్ముడుపోయాయా?
మజాకా సినిమాలో రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి మంచి హైప్ నెలకొల్పారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మజాకా సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది.
తాజాగా మజాకా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
Also Read : Sivangi Teaser : ‘శివంగి’ టీజర్ చూశారా.. వంగేవాళ్ళు ఉన్నంత వరకు..మింగేవాళ్ళు ఉంటారు.. ఆనంది మాస్..
ఇక ట్రైలర్ చూస్తుంటే.. తండ్రి కొడుకులు ఇద్దరూ వేరువేరు ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తే వారి ప్రేమ, పెళ్లితో ఫుల్ లెంగ్త్ కామెడీగా సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రైటర్ ప్రసన్న మార్క్ కామెడీ పంచ్ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. చివర్లో మ్యాన్షన్ హౌస్ తీసుకొచ్చి బాలయ్య బాబు ప్రసాదం కళ్ళకద్దుకొని తాగాలి.. జై బాలయ్య అనాలి అంటూ ట్రైలర్ ఆద్యంతం నవ్వించారు. దీంతో సినిమాలో కూడా తండ్రీకొడుకులు ఫుల్ గా నవ్విస్తారని తెలుస్తుంది.