Sundeep Kishan Ritu Varma Rao Ramesh Mazaka Movie Review and Rating
Mazaka Movie Review : సందీప్ కిషన్, రీతువర్మ జంటగా తెరకెక్కిన సినిమా ‘మజాకా’. హాస్య మూవీస్, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మాణంలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ప్రసన్న కుమార్ బెజవాడ కథ, కథనంలో మజాకా సినిమా తెరకెక్కింది. రావు రమేష్, అన్షు అంబానీ, మురళి శర్మ, హైపర్ ఆది.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. నేడు ఫిబ్రవరి 26 శివరాత్రి కానుకగా మజాకా సినిమా రిలీజవుతుండగా నిన్న రాత్రే చాలా చోట్ల ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే.. కృష్ణ(సందీప్ కిషన్), రమణ(రావు రమేష్) తండ్రి కొడుకులు. కృష్ణ పుట్టినప్పుడే తల్లి చనిపోవడంతో ఇంట్లో వీరిద్దరే ఉంటారు. వీళ్ళ ఇంట్లోకి ఒక అమ్మాయి రావాలని, ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉండాలని అనుకుంటారు. కృష్ణకు సంబంధాలు ట్రై చేస్తుంటే ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఆడతోడు లేని ఇంటికి పిల్లను ఇవ్వం అని అంటూ ఉంటారు.
రమణకి పెళ్లి అయితే కృష్ణకు సంబంధాలు వస్తాయి అని చెప్తారు. అదే సమయంలో రమణ యశోద(అన్షు అంబానీ)ని చూసి ప్రేమిస్తాడు. కృష్ణ కూడా మీరా(రీతూ చౌదరి) ప్రేమలో పడతాడు. మరి వీరిద్దరి ప్రేమలు ఫలించాయా? వీరికి పెళ్లిళ్లు అయ్యాయా? వీరి పెళ్లి అవ్వడానికి ఎదురైన అడ్డంకులు ఏంటి? యశోద ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎందుకుంది? యశోద – మీరాకు సంబంధం ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Chiranjeevi-Ram Charan : దసరాకు మెగా ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా!
సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ అంతా కృష్ణ, రమణ తండ్రి కొడుకుల పాత్రలు, వాళ్ళు ఒక ఫ్యామిలీ కావాలి అనుకోవడం, యశోద, మీరా పాత్రలు, వారితో ప్రేమ చూపిస్తారు. ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ సినిమా చూస్తున్న వాళ్లకు అర్థమైపోతుంది. అయితే ఇంటర్వెల్ అయిన తర్వాత ఎవ్వరూ ఊహించని ఆసక్తికర ట్విస్ట్ ఇస్తారు. దీంతో వీరి పెళ్లి జరుగుతుందా అనే సందేహం వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా తండ్రి కొడుకులు వాళ్ళ పెళ్లిళ్లు జరగడానికి ఏం చేసారు అని సాగుతుంది.
ఫస్ట్ హాఫ్ అక్కడక్కడా కామెడీతో సింపుల్ గా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. సీన్స్ ని బాగా సాగదీశారు. కొన్ని సీన్స్ అవసరమా అనిపిస్తుంది. ఏదో కామెడీ జొప్పించాలని సీన్స్ రాసుకున్నట్టు ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఇచ్చిన ట్విస్ట్ కొత్తగా ఉన్నా దానికి ఇచ్చే జస్టిఫికేషన్ చివరి వరకు సరిగ్గా ఉండదు. చివర్లో మాత్రం కాస్త ఎమోషన్ పండించడానికి ట్రై చేసారు.
ప్రేక్షకులను నవ్విద్దాం అని అనుకున్నా పలు కారణాలతో సినిమా షూటింగ్స్ వాయిదా పడటం, రిలీజ్ డేట్ దగ్గరకు పడటంతో చివర్లో సినిమా ఏదో హడావిడిగా తీశారు అని కొన్ని సీన్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇంట్లో అమ్మాయి ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ ఫోటో ఉండాలి అనే మంచి కాన్సెప్ట్ తీసుకున్నా కథనం ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక పాటలు అయితే సన్నివేశాలకు సంబంధమే ఉండదు. ఏదో పాటలు ఉండాలి కదా అని పెట్టినట్టు ఉన్నారు. సెన్సార్ కట్ లో బాలయ్య, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశించిన డైలాగ్స్ తీసేసారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. సందీప్ కిషన్ ఎప్పట్లాగే తన పాత్రలో యాక్టివ్ గా కనపడ్డాడు. ఓ అమ్మాయి వెనక పడే తండ్రి పాత్రలో రావు రమేష్ చాలా ఎనర్జీగా నటించి నవ్వించడానికి బాగా ప్రయత్నం చేసారు. రీతూ వర్మ అదే సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో పర్వాలేదనిపిస్తుంది. కమర్షియల్ డ్యాన్సులు ట్రై చేసినా తనకు వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది.
మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో రావు రమేష్ సరసన పాత్ర చేయడం సాహసమనే చెప్పొచ్చు. తన పాత్ర వరకు బాగానే మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా తర్వాత మళ్ళీ బిజీ అవుతుందేమో చూడాలి. మురళి శర్మ పాత్ర క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. హైపర్ ఆది అక్కడక్కడా నవ్విస్తాడు. శ్రీనివాస రెడ్డి, అజయ్, రోహిణి, గగన్ విహారి, రఘుబాబు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పిస్తారు.
Also Read : MAD Square teaser : అదిరిపోయిన మ్యాడ్ స్క్వేర్ టీజర్.. నవ్వులే నవ్వుల్..
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి హడావిడిగా తీసినట్టు కొన్ని సీన్స్ అనిపిస్తాయి. కొన్ని సీన్స్ కలర్ గ్రేడింగ్ చేయించలేదు. పాటలు కూడా యావరేజ్. యూట్యూబ్ సెన్సేషన్ సాంగ్ మాత్రం పర్వాలేదనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రమే.
డబ్బింగ్ కూడా కొన్ని కొన్ని డైలాగ్స్ మిస్ అయ్యాయి. ఆర్టిస్టులు దొరక్క కొందరివి వేరే వాళ్ళతో చెప్పించినట్టు ఈజీగా తెలిసిపోతుంది. ఒక మంచి పాయింట్ ని కథగా తీసుకున్నా కథనం ఇంకా బెటర్ గా రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగ్స్ డబ్బింగ్ లో మిస్ అయ్యాయి. కొన్ని డైలాగ్స్ బాగానే నవ్విస్తాయి. ఆల్రెడీ పలు హిట్స్ ఇచ్చిన దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకుడిగా మంచి అవుట్ ఫుట్ ఇవ్వడానికి ట్రై చేసాడు. నిర్మాణ పరంగా కూడా ఇంకాస్త క్వాలిటీగా తెరకెక్కిస్తే బాగుండేది అనిపిస్తుంది.
మొత్తంగా ‘మజాకా’ సినిమా ఓ మంచి పాయింట్ ని కామెడీగా చెప్పడానికి ప్రయత్నించారు. అక్కడక్కడా నవ్వుకోవచ్చు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.