Chiranjeevi-Ram Charan : దసరాకు మెగా ఫ్యాన్స్‌కు డబుల్ బొనాంజా!
గేమ్‌ఛేంజర్ రిజల్ట్‌తో డీలాపడిపోయిన మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది.

Chiranjeevi guest appearance in ram charan movie
గేమ్‌ఛేంజర్ రిజల్ట్‌తో డీలాపడిపోయిన మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. అభిమానుల ఆకలి తీర్చేలా సినిమాపై అంచనాలు పెంచేలా చెర్రీతో కలిసి చిరు ఓ భారీ ప్లాన్ రెడీ చేశారట. ఇద్దరు కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నారనే టాక్.. ఫిల్మ్‌నగర్‌ను షేక్ చేస్తోంది.
రాంచరణ్ లేటెస్ట్ మూవీ గేమ్‌చేంజర్ నిరాశపరిచింది. దీంతో చెర్రీ నెక్ట్స్ మూవీపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న RC16 కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మూవీ షూటింగ్ కూడా ఫాస్ట్‌గా జరిగిపోతోంది. అన్నీ కుదిరితే.. దసరాకి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉంది మూవీ టీమ్.
గేమ్‌చేంజర్‌తో డిజప్పాయింట్‌మెంట్‌లో ఉన్న అభిమానులకు.. ఈ సినిమా హిట్‌తో జోష్ నింపాలని రాంచరణ్ కసితో ఉన్నాడు. ఇక అటు మూవీకి సంబంధించి ఇప్పటికే మూడు పాటలను రెహమాన్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా ఎలా చూసినా.. దసరాకు బాక్సాఫీస్ దగ్గర చెర్రీ సందడి ఖాయంగా కనిపిస్తోంది.
Producer Kedar Selagamsetty : టాలీవుడ్‌లో విషాదం.. గంగం గణేశా చిత్ర నిర్మాత కన్నుమూత
రాంచరణ్ మూవీకి సంబంధించి ఇప్పుడు క్రేజీ న్యూస్ ఒకటి.. టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది. RC16లో చరణ్‌తో పాటు చిరు కూడా యాక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. చెర్రీ సినిమాలో కనిపించడం మెగాస్టార్‌కు మహా ఇష్టం. చెర్రీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇలా చాలా సినిమాల్లో తళుక్కున మెరిశాడు.
MAD Square teaser : అదిరిపోయిన మ్యాడ్ స్క్వేర్ టీజర్.. నవ్వులే నవ్వుల్..
గతంలో మగధీరలో చెర్రీతో కలిసి చిన్న స్టెప్ వేశారు. తర్వాత బ్రూస్‌లీ సినిమాలో ఇద్దరు అలరించారు. ఆ తర్వాత ఆచార్యలో ఎక్కువసేపు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు బుచ్చిబాబు సినిమాలోనూ మెగాస్టార్.. ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలైట్ కాబోతుందని అంటున్నారు. ఐతే నిజమా కాదా అన్న దానిపై.. మూవీ టీమ్ నుంచి క్లారిటీ రాలేదు. నిజం అయితే మాత్రం మెగా ఫ్యాన్స్‌కు దసరాకు డబుల్ బొనాంజానే