Sundeep Kishan : సీఎం విజయ్ ఫ్యాన్స్ చేతిలో సందీప్ కిషన్ భవిష్యత్తు..
ప్రస్తుతం విజయ్ తమిళ్ లో డైరెక్ట్ గా సిగ్మా అనే సినిమా చేస్తున్నాడు. (Sundeep Kishan)
- Saketh U
- Published on- May 30, 2026 / 08:07 AM IST
Sundeep Kishan
Sundeep Kishan : మన సందీప్ కిషన్ భారీ కమర్షియల్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది. ఊరుపేరు భైరవకోన సినిమా ఓ మోస్తరు విజయం అందుకుంది. ఆ తర్వాత, ముందు చెప్పుకోదగ్గ విజయాలు లేవు. సందీప్ హీరోగా చేస్తూనే తమిళ్ స్టార్స్ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాడు. సందీప్ కి తమిళ్ లో కూడా ఎంతో కొంత మార్కెట్ ఉంది. ముందు నుంచి సందీప్ తమిళ్ సినిమాల్లో చేయడం, తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేయడం చేస్తున్నాడు.
ఇటీవల వరుసగా కెప్టెన్ మిల్లర్, రాయన్, మైఖేల్.. సినిమాల్లో నటించి తమిళ్ మీద ఎక్కువ ఫోకస్ చేసాడు. ప్రస్తుతం విజయ్ తమిళ్ లో డైరెక్ట్ గా సిగ్మా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరో కాదు తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్. విజయ్ హీరోగా నిలబడితే అతని కొడుకు మాత్రం దర్శకత్వం వైపు వచ్చి దర్శకుడు అవుతున్నాడు. జేసన్ సంజయ్ కి ఇది మొదటి సినిమా. సందీప్ కిషన్ సోలో హీరోగా చేస్తున్న సినిమా.
జేసన్ సంజయ్ డైరెక్టర్ గా మొదటి సినిమా ప్రకటించినప్పుడు విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాని తమ భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసారు. దీంతో రిలీజ్ సమయంలో విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాకు వస్తే కలెక్షన్స్ వస్తాయి, హిట్ అవుద్ది, తమిళ్ లో సందీప్ కిషన్ కి మార్కెట్ వస్తది అని లెక్కలు వేసుకున్నారు.
కట్ చేస్తే విజయ్ – అతని భార్య విడిపోవడం, కొడుకు సంజయ్ కూడా విజయ్ ని సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం, రాజకీయాల్లో సపోర్ట్ చేయకపోవడం, సీఎం అయినా కంగ్రాట్స్ చెప్పకపోవడం, అసలు విజయ్ కొడుకు మీడియా ముందే కనపడకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు. పలువురు ఫ్యాన్స్ సంజయ్ పై తీవ్ర విమర్శలు కూడా చేసారు.
Also Read : Aaradhya Devi : చాన్నాళ్లకు బోల్డ్ ఫోజులతో వైరల్ అవుతున్న ఆర్జీవీ భామ.. ఈమెని గుర్తుపట్టారా?
అయితే ఇప్పుడు సంజయ్ దర్శకత్వం సందీప్ కిషన్ చేసిన సిగ్మా సినిమా జులై 31న రిలీజ్ కానుంది. మరి విజయ్ – అతని కొడుకు మధ్య దూరం, విజయ్ ఫాన్స్ కోపం ఈ సినిమాపై ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అని చర్చగా మారింది. విజయ్ కొడుకు మొదటి సినిమాకు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారా? సందీప్ కిషన్ కి మద్దతు ఇస్తారా? ఈ సినిమాని విజయ్ ఫ్యాన్స్ మోస్తారా అనేది సందేహమే. సినిమా రిలీజ్ అయ్యేలోపు జేసన్ సంజయ్ ఒక్కసారైనా తన తండ్రి విజయ్ ని కలిస్తే పరిస్థితులు కొంత అనుకూలంగా మారి సినిమాకు సపోర్ట్ రావొచ్చు. లేకపోతే కష్టమే అంటున్నారు తమిళ వర్గాలు. మొత్తానికి ఇప్పుడు సందీప్ కిషన్ తమిళ మార్కెట్, భవిష్యత్తు విజయ్ ఫ్యాన్స్ చేతిలో ఉంది.
