Sunitha Tati : మన దగ్గర కథల కొరత ఉంది.. ప్రతి వారం బాహుబలి రాదు..

నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ.. '' నా దృష్టిలో కథ అనేది ఒక ప్రయాణం. కానీ మనకి ఇక్కడ కొన్ని పరిమితుల వల్ల కథారచయితలకు ఎక్కువ ఫ్రీడమ్‌ ఇవ్వట్లేదనిపిస్తుంది. అందుకే ఎక్కువగా మనం కొరియన్‌ సినిమాలను రీమేక్‌ చేస్తున్నాం. రీమేక్ అయినా..........

 

Sunitha Tati :  రెజీనా, నివేదా థామస్‌ మెయిన్ లీడ్స్ గా కొరియన్ సినిమా మిడ్‌నైట్ రన్నర్స్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా ‘శాకిని డాకిని’. సుధీర్‌ వర్మ ఈ సినిమాని తెరకెక్కించగా సునీత తాటి నిర్మించింది. సురేష్‌బాబు ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. శాకిని డాకిని సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ తెలుగు సినిమా కథలపై వ్యాఖ్యలు చేశారు.

నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ.. ” నా దృష్టిలో కథ అనేది ఒక ప్రయాణం. కానీ మనకి ఇక్కడ కొన్ని పరిమితుల వల్ల కథారచయితలకు ఎక్కువ ఫ్రీడమ్‌ ఇవ్వట్లేదనిపిస్తుంది. అందుకే ఎక్కువగా మనం కొరియన్‌ సినిమాలను రీమేక్‌ చేస్తున్నాం. రీమేక్ అయినా కథలో సోల్‌ను తీసుకుని ఇక్కడి నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేయడం అనేది సులువైన పని కాదు. శాకిని డాకిని సినిమాకి అక్షయ్‌ అనే కుర్రాడు స్క్రీన్‌ప్లే అందించాడు.”

Ponniyin Selvan 1 Trailer : పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ చూశారా.. బాహుబలికి మించి ఉందిగా..

”మన దగ్గర కథల కొరత ఉందని నా ఫీలింగ్‌. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి తీసుకెళ్లారు. కానీ ప్రతి వారం ‘బాహుబలి’ లాంటి సినిమా రాదు. ఇంకా కొత్త కథలు కావాలి మనకి. మంచి మంచి సినిమాలు ప్రతివారం విడుదలవ్వాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రీమేక్‌ రైట్స్‌ కావాలని కొందరు ఫిల్మ్‌మేకర్స్‌ నన్ను అడిగారు. ఈ విషయాన్ని నేను రాజమౌళి గారికి చెప్పాను” అని తెలిపింది. ఇక్కడ కథలు తక్కువున్నాయి, రచయితలకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు