Ponniyin Selvan 1 Trailer : పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ చూశారా.. బాహుబలికి మించి ఉందిగా..

తాజాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ట్రైలర్ ని విడుదల చేశారు. తెలుగు వర్షన్ కి రానా వాయిస్ ఓవర్ అందించడంతో దీనిపై మరింత హైప్ పెరిగింది. ఇక ట్రైలర్ చుసిన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. స్టార్ యాక్టర్స్ నటన, యుద్ధ సన్నివేశాలు, సముద్రంలో...........

Ponniyin Selvan 1 Trailer : పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ చూశారా.. బాహుబలికి మించి ఉందిగా..

Ponniyin Selvan 1 Trailer Released

Ponniyin Selvan 1 Trailer :  మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్య రాయ్‌, త్రిష, జయరామ్.. లాంటి స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన భారీ సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా మొదటి పార్ట్ ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ట్రైలర్ ని విడుదల చేశారు. తెలుగు వర్షన్ కి రానా వాయిస్ ఓవర్ అందించడంతో దీనిపై మరింత హైప్ పెరిగింది. ఇక ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. స్టార్ యాక్టర్స్ నటన, యుద్ధ సన్నివేశాలు, సముద్రంలో పడవలు, రాజ్యం కోసం కొట్లాటలు.. వీటన్నిటిని చూసిన తర్వాత కచ్చితంగా వావ్ అనిపిస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

Captain Movie : ఆర్య ‘కెప్టెన్’ కథ ఇదేనా..? హాలీవుడ్ రేంజ్ లో గ్రాఫిక్స్..

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ట్రైలర్ లోనే ఈ రేంజ్ గ్రాఫిక్స్, విజువల్స్ ఉన్నాయంటే ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో అని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ట్రైలర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక దీనికి ఏఆర్‌. రెహమాన్‌ ఇచ్చిన సంగీతం కూడా చాలా బాగా ఆకట్టుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులని బద్దలు కొడుతుందో చూడాలి.