Sunjay Kapoor
Sunjay Kapoor : బిజినెస్ మెన్ సంజయ్ కపూర్ 2003 లో బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ ని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. అనంతరం సంజయ్ కపూర్ 2017లో ప్రియా సచ్ దేవ్ ను పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు ఒక బాబు ఉన్నాడు. అయితే ఇటీవల జూన్ లో సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించారు.(Sunjay Kapoor)
సంజయ్ కపూర్ మరణించిన తర్వాత ప్రియా సచ్ దేవ్, కరిష్మా కపూర్ ఫ్యామిలీల మధ్య సంజయ్ ఆస్తి కోసం గొడవలు మొదలయ్యాయి. సంజయ్ కపూర్ వీలునామా విషయంలో ప్రియా సచ్ దేవ్ మోసం చేసిందని కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : Abhishek Aishwarya : మొన్న ఐశ్వర్య రాయ్.. ఇవాళ అభిషేక్ బచ్చన్.. కోర్టును ఆశ్రయించిన భార్యాభర్తలు..
కోర్టులో వేసిన పిటిషన్ లో.. కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి బతికున్నప్పుడు మాకు ఆర్థికంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సంజయ్ కపూర్ రాసిచ్చిన అసలు వీలునామాను దాచి పెట్టి ప్రియా సచ్ దేవ్ నకిలీ వీలునామాను ఫ్యామిలీ మీటింగ్ లో చూపించింది. మా తండ్రి మరణాంతరం ఆయన ఆస్తి వివరాలు, వాటికి సంబంధించిన పత్రాలు మాకు చూపించట్లేదు.చట్టపరంగా ఆయన ఆస్తిలో ఇద్దరి పిల్లలకు చెరొక 5వ వంతు వాటా ఇప్పించాలని కోరారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
అయితే దీనిపై కోర్టు విచారణ జరిపి సంజయ్ కపూర్ ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలకు సమర్పించాలని ప్రియా సచ్ దేవ్ ని కోర్టు ఆదేశించింది. దీనికి గాను సంజయ్ కపూర్ వీలునామా రిజిస్టర్ కానప్పటికీ అది చెల్లుబాటు అవుతుందని, ఇప్పటికే ఫ్యామిలి ట్రస్ట్ ద్వారా కరిష్మా కపూర్ పిల్లలకు 1900 కోట్లు అందాయని, ఇంకా వాళ్లకు ఎంత కావాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఎందుకు అంతగా ఏడుస్తున్నారు? ఇన్నాళ్లు లేని ప్రేమ సంజయ్ కపూర్ మరణించిన తర్వాత వచ్చిందా అంటూ ప్రియా సచ్ దేవ్, ఆమె తరపు న్యాయవాది కోర్టులో వ్యాఖ్యానించారు. దీంతో సంజయ్ కపూర్ ఆస్తి వివాదంపై ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.
Also Read : Ritika Nayak : ‘మిరాయ్’ భామ రితిక నాయక్.. ఎంత క్యూట్ గా ఉందో..