Mandira : ‘మందిర’ గా భయపెట్టేందుకు వస్తున్న సన్నీ లియోన్..
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
- Thota Vamshi Kumar
- Published On : November 12, 2024 / 11:25 AM IST
Mandira release date fix
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరెంట్ తీగ సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరోసారి భయపట్టేందుకు వస్తోంది. మందిర చిత్రంతో తెలుగు ప్రేక్షకులను భయపెడతాను అంటోంది.
సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ‘మందిర’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ యువన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఇప్పటికే మందిర మూవీ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా చిత్ర బృందం రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చింది.
ఈ చిత్రానికి నవంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. జావెద్ రియాజ్ సంగీతం అందించగా తమిళ నటుడు యోగిబాబు కీలక పాత్రలో నటించారు.
Satyadev : ఆర్ఆర్ఆర్ మూవీలో సత్యదేవ్.. ఎడిటింగ్ లో తీసేసిన దర్శకుడు..!
