Bhairavam : భైర‌వం నుంచి మంచు మ‌నోజ్ లుక్‌.. వ‌ర్షంలో పంచెక‌ట్టి న‌డుస్తున్న గ‌జ‌ప‌తి వ‌ర్మ‌.. అదిరింది

బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మ‌నోజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ భైర‌వం.

Bhairavam : భైర‌వం నుంచి మంచు మ‌నోజ్ లుక్‌.. వ‌ర్షంలో పంచెక‌ట్టి న‌డుస్తున్న గ‌జ‌ప‌తి వ‌ర్మ‌.. అదిరింది

Manoj Manchu first look from Bhairavam movie

Updated On : November 12, 2024 / 11:39 AM IST

బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్‌, మంచు మ‌నోజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న మూవీ భైర‌వం. ఉగ్రం ఫేం విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్‌, నారా రోహిత్‌లకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే స్పందిన వ‌చ్చింది.

తాజాగా రాకింగ్ స్టార్ మంచు మ‌నోజ్‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో గ‌జ‌ప‌తి వ‌ర్మ పాత్ర‌లో ఆయ‌న న‌టిస్తున్నారు.

Satyadev : ఆర్ఆర్ఆర్ మూవీలో స‌త్య‌దేవ్.. ఎడిటింగ్ లో తీసేసిన ద‌ర్శ‌కుడు..!

వ‌ర్షంలో పంచె క‌ట్టి ఆయ‌న న‌డుస్తూ వ‌స్తున్న‌ట్లుగా పోస్ట‌ర్ ఉంది. వెనుకాల కారు. ఆ ప‌క్క‌న జ‌నాలు గొడుగు ప‌ట్టుకుని న‌డుస్తూ వ‌స్తున్నారు. మొత్తంగా మ‌నోజ్ లుక్ అదిరిపోయింది.

థ్రిల్లింగ్ యాక్షన్ ప్యాక్‌డ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో నారా రోహిత్ వ‌ర‌ద‌గా క‌నిపించ‌బోతున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.

Avneet Kaur : టామ్ క్రూజ్‌ని క‌లిసిన‌ న‌టి అవ్నీత్ కౌర్.. ‘క‌ల నిజ‌మైంది’ అంటూ పోస్ట్‌.. పిక్స్ వైర‌ల్‌