Satyadev : ఆర్ఆర్ఆర్ మూవీలో సత్యదేవ్.. ఎడిటింగ్ లో తీసేసిన దర్శకుడు..!
దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Rajamouli chopped off Satyadev role in the RRR movie
Satyadev : దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఆస్కార్ అవార్డుతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులను సైతం సాధించింది. కాగా.. ఈ చిత్రంలో నటుడు సత్యదేవ్ సైతం నటించాడట.
సత్యదేవ్ త్వరలో జీబ్రా అనే మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో జీబ్రా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలను ఇచ్చాడు సత్యదేవ్. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను ఆర్ఆర్ఆర్ మూవీలో నటించినట్లు చెప్పాడు.
చాలా రోజులు ఆ చిత్రం కోసం పని చేశాడట. అయితే.. అతడు చేసిన సీన్లు, ఆ ఎపిసోడ్ మొత్తాన్ని ఎడిటింగ్‌లో రాజమౌళి తీసేసినట్లు చెప్పాడు.
చిత్ర బృందం మీద ఉన్న గౌరవంతోనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని ఎక్కడా బయటకు చెప్పలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ నటుడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆయన ఏం సీన్స్ చేశారని అభిమానులు, నెటిజన్లు అడుగుతున్నారు. కనీసం డిలీటెడ్ సీన్స్ అని చెప్పి సత్యదేవ్ నటించిన సన్నివేశాలను సోషల్ మీడియాలో విడుదల చేయాలని కోరుతున్నారు.
Dil Raju : కొత్తవాళ్ళ కోసం దిల్ రాజు డ్రీమ్స్.. కన్నడలో బలగం సినిమా రీమేక్..