Dil Raju : కొత్తవాళ్ళ కోసం దిల్ రాజు డ్రీమ్స్.. కన్నడలో బలగం సినిమా రీమేక్..

తాజాగా మరో నిర్మాణ సంస్థ ప్రారంభించారు దిల్ రాజు.

Dil Raju : కొత్తవాళ్ళ కోసం దిల్ రాజు డ్రీమ్స్.. కన్నడలో బలగం సినిమా రీమేక్..

Dil Raju Started new Production House Dil Raju Dreams for Encouraging New Talent

Updated On : November 11, 2024 / 9:48 PM IST

Dil Raju : డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టిన దిల్ రాజు నిర్మాతగా మారి ఎన్నో హిట్స్ తీశారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ తన 50వ సినిమాగా, తన నిర్మాణ సంస్థలో మొదటి పాన్ ఇండియా సినిమాగా రానుంది. ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇన్నాళ్లు సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. ఇటీవల కొన్నాళ్ల క్రితం దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి దాంట్లో చిన్న, మీడియం సినిమాలు చేస్తామని ప్రకటించారు. తాజాగా మరో నిర్మాణ సంస్థ ప్రారంభించారు దిల్ రాజు.

కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి అంటూ దిల్ రాజు డ్రీమ్స్ అనే సంస్థను ప్రారంభించారు. దీనికి సంబంధించి నేడు ఓ ప్రెస్ మీట్ కూడా నిర్వహించి దీని గురించి చెప్పారు. దిల్ రాజు మాట్లాడుతూ.. దిల్ రాజు డ్రీమ్స్ లో కొత్త వాళ్ళతో సినిమాలు తెరకెక్కిస్తాము. రచయితలు, నటుడు, దర్శకులే కాదు అన్ని విభాగాల్లో కొత్తవాళ్లను తీసుకొని వాళ్ళు చెప్పిన కథల్లో బెస్ట్ తీసుకొని తక్కువ బడ్జెట్ సినిమాలు తీస్తాము అని తెలిపారు.

Also Read : Mission Impossible : మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ మూవీ రిలీజ్ డేట్, ట్రైలర్ అనౌన్స్.. ట్రైలర్ అదిరిందిగా.. రిలీజ్ ఎప్పుడంటే..

అలాగే ఇదే ప్రెస్ మీట్ లో బలగం సినిమాను కన్నడ నుంచి వచ్చి రీమేక్ రైట్స్ కొనుక్కున్నారని, కన్నడలో వాళ్లకు తగ్గట్టు కథను మార్చుకొని బలగం సినిమాను అక్కడ రీమేక్ చేస్తారని తెలిపారు. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ కథతో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కించిన బలగం సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే.